ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur: బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై పాక్షికంగా నిషేధం తొలగింపు

ABN, First Publish Date - 2023-07-25T17:11:42+05:30

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న నిషేధాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.

ఇంఫాల్: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌ (Manipur)లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ సర్వీసులపై (Internet Services) ఉన్న నిషేధాన్ని (Ban) క్రమక్రమంగా ఎత్తివేయాలని (Lift) ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని షరతులతో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N.Biren Singh) సమావేశమైన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.


రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, నిర్దిష్ట షరతులపై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మంగళవారంనాడు పునరుద్ధంచారు. యూజర్లు తప్పనిసరిగా అండర్‌టేకింగ్‌పై సంతకం చేయాల్సి ఉంటుందని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ డాటాపై ఉన్న నిషేధం మాత్రం కొనసాగిస్తున్నట్టు తెలిపింది. మే 3న తేదీన మణిపూర్‌లో మెజారిటీ మెయతీ, గిరిజన కుకీ జాతుల మధ్య ఘర్షణలు తలెత్తి హింసాత్మక రూపు దాల్చడంతో ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం అమలు చేశారు. అప్పట్నించి 80 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారంనాడు పాక్షికంగా తొలగించింది.

Updated Date - 2023-07-25T19:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising