ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar And KCR : షాకింగ్.. గద్దర్‌ను కేసీఆర్ ఇంతలా అవమానించారా.. 3 గంటలపాటు ఎండలోనే..!

ABN, First Publish Date - 2023-08-08T23:13:16+05:30

స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాలనే ఆకాంక్ష పరంగా సీఎం కేసీఆర్‌ (CM KCR), దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ (Gaddar) ఇద్దరూ ఇద్దరే!. బడుగు జీవుల బతుకులకు, తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నిలిచిన గద్దర్‌కు సీఎం కేసీఆర్‌ దూరంపాటిస్తూనే వచ్చారు..

స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాలనే ఆకాంక్ష పరంగా సీఎం కేసీఆర్‌ (CM KCR), దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ (Gaddar) ఇద్దరూ ఇద్దరే!. బడుగు జీవుల బతుకులకు, తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నిలిచిన గద్దర్‌కు సీఎం కేసీఆర్‌ దూరంపాటిస్తూనే వచ్చారు. అది ఉద్యమంలోనూ.. స్వరాష్ట్రం సిద్ధించాక కొనసాగింది. ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్‌‌ను కలవడానికి గద్దర్ ప్రయత్నించారు. ఒక్కసారి కూడా సీఎం కనికరించలేదు.! పైగా గంటల తరబడి ప్రగతి భవన్‌ దగ్గర.. అది కూడా ఎండలోనే వేచి చూడాల్సి వచ్చింది.! అయినా సరే.. అవకాశం వస్తుందేమోనని వేచి చూసిన గద్దర్ చివరికి నిరాశే మిగిలింది.! ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో అయ్యో.. ఏంది సారూ ఇలా చేశారు.. ఏ సమస్య మీద వచ్చారో.. పాపం కలిసే అవకాశం కల్పించి ఉంటే బాగుండు కదా..? అని కేసీఆర్‌పై కవులు, కళాకారులు, కొందరు సొంత పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట.


ఈ విషయం ఎలా బయటికొచ్చింది..?

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Murali Akunuri) మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘గద్దరన్న కేసీఆర్‌ను కలవడానికి రెండు సార్లు ప్రయత్నం చేసిండు. ఈ ఫోటో 28 ఫిబ్రవరి2023 రోజు నాటిది.. ప్రగతిభవన్ వెళ్లి 3 గంటలు గేట్ దగ్గర ఎండలో కూర్చొని కేసీఆర్‌ను కలవడానికి అనుమతి కోరిండు. బతికి ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడక అవమానించిండు, చనిపోయాక అధికార లాంఛనాలు అని గద్దరన్న ఇంటికి పోయి ఓట్ల వేట మొదలు పెట్టిండు’ అని మురళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన కవులు, గద్దర్ ఫాలోవర్స్.. కేసీఆర్‌పై కన్నెర్రజేస్తున్నారు. పాపం.. గద్దరన్న ఏం చెప్పాలని వచ్చారో కనీసం లోనికి అనుమతించి మాట్లాడొచ్చు కదా..? సారెందుకిలా చేశారో..? అని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ఏం సమస్య చెప్పుకునేకి వచ్చిర్రో పాపం.. కేసీఆర్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించారేంటి..? అని విమర్శిస్తున్నారు.

మొదట్నుంచీ దూరమే..?

తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగా, క్రమంగా అందరూ ఉద్యమకారుల్లాగే కేసీఆర్‌కు గద్దర్‌ దూరమవుతూ వచ్చారు. అల్వాల్‌లోని వెంకటాపూర్‌లో తన కుమారుడి స్మారకార్థం గ్రంథాలయం పెట్టాలని గద్దర్‌ తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకు భూమిని కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరగా... మార్కెట్‌ విలువతో ఆ భూమిని ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. అంత మొత్తాన్ని తాను చెల్లించలేనని, రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వాన్ని గద్దర్‌ కోరినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు.. గద్దర్‌ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. సరిగ్గా అదే సమయానికి శాసన సభలో సీఎంసీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొద్ది సేపటికే గద్దర్‌ మరణ వార్తను అధికారులు కేసీఆర్‌కు చేరవేశారు. అయితే కేసీఆర్‌ రెండుగంటల 20నిమిషాల సేపు మాట్లాడినా ఎక్కడా కూడా గద్దర్‌ ప్రస్తావన తీసుకురాలేదు. వాస్తవానికి గద్దర మరణ వార్త తెలిసిన వెంటనే అసెంబ్లీని మరుసటి రోజుకు వాయిదా వేస్తారని అంతా భావించారు. అలా జరగలేదు. గద్దర్‌ గురించి ఒక్క ముక్క కూడా కేసీఆర్ మాట్లాడకపోవడం ఆయన అభిమానులను నిరాశపర్చింది. చివరకు, మంత్రి కేటీఆర్‌ గద్దర్‌ గురించి మాట్లాడి, సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఆఖరికి ఇలా..!

పీడితుల బతుకు పాటకు నిలువెత్తు రూపమైన ప్రజా వాగ్గేయకారుడి మరణంతో యావత్‌ తెలుగు సమాజం దిగ్ర్భాంతికి లోనైంది. లెఫ్ట్‌, రైట్‌ భావజాల వైరుధ్యాలను పక్కనపెట్టి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వెల్లువెత్తారు. ఈ సమయంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరించిన తీరు చర్చనీయంగా మారింది. తొలుత స్పందించకుండా.. కాంగ్రెస్‌ నేతలు అంతా తామై వ్యవహరించడాన్ని చూసిన తర్వాత.. అనివార్య పరిస్థితుల్లోనే బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారనే విమర్శలు బలంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కూడా ఎన్నికల, క్రెడిట్‌ రాజకీయాలకు పాల్పడడం పలువురిని నివ్వెరపరిచింది. నిజానికి, గద్దర్‌ మరణించారని తెలిసిన వెంటనే అందరి కంటే ముందు ఆదివారం కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆస్పత్రికి తరలి వెళ్లారు. గద్దర్‌ పార్థివ దేహాన్ని సందర్శించారు. చూశారుగా.. ఆది నుంచి గద్దర్‌కు కేసీఆర్‌కు పడలేదు. సీఎం అయ్యాక కలుద్దామని వెళితే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి అధికారిక లాంఛనాలతో అంటూ హడావుడి చేశారు. అది కూడా కాంగ్రెస్ నేతలు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో దిగొచ్చిన గులాబీ బాస్.. ఇలా చేయాల్సి వచ్చిందన్న మాట. పాపం.. రెండుసార్లు ప్రయత్నించారు.. ఏం చెప్పాలనుకున్నారో ఏమో అనే ఆలోచన గద్దర్ అభిమానులు, కవుల్లో మనసుల్లో మెదులుతూనే ఉందట.


ఇవి కూడా చదవండి


TS Congress : ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం.. ఇక రాబోయే రోజుల్లో..!


TS Politics : బీఆర్ఎస్‌‌కు ఊహించని షాక్.. కాంగ్రెస్‌లోకి బిగ్ షాట్.. పార్టీలో చేరకముందే సర్వే చేయగా..?


YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?


Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?


TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?



Updated Date - 2023-08-08T23:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising