ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narsapur BRS: నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ.. సీఎం కేసీఆర్ ఎందుకు ప్రకటించలేదంటే..

ABN, First Publish Date - 2023-08-21T21:08:27+05:30

నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నర్సాపూర్‌తో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చకుండా పెండింగ్లో ఉంచారు. ఈ నెల 23న మెదక్లో సీఎం పర్యటన నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం.

నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నర్సాపూర్‌తో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చకుండా పెండింగ్లో ఉంచారు. ఈ నెల 23న మెదక్లో సీఎం పర్యటన నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం.

మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీఎం మెదక్ పర్యటన తర్వాతే నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. వయోభారంతో మదన్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కే అవకాశాలే లేవని బీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.


కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డికి టికెట్ దక్కొచ్చని చెబుతును్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న స్పష్టమైన హామీ పొందిన తరువాతనే ఆమె బీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెబుతున్నారు. కొంతకాలంగా బీసీ నినాదాన్ని వినిపిస్తున్న శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ కూడా నర్సాపూర్ బీఆర్‌ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి నర్సాపూర్ టికెట్ బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. ఒకవేళ బీసీలను పక్కనపెట్టి మరోసారి అగ్రవర్ణాలకే బీఆర్‌ఎస్ టికెట్‌ను కేటాయిస్తే పార్టీలోని బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాత్రం ఈసారి టికెట్ కోసం కొంచెం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘మీకు టికెట్ రాకపోతే మేము పార్టీలోనే ఉండబోం’ అంటూ నర్సాపూర్‌కు చెందిన కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిసి సంఘీభావం కూడా వ్యక్తం చేశారు. నర్సాపూర్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి టికెట్ కోసం పోటీపడుతున్నారు. అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తే హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు నెలకొల్పుతానని ధీమాగా ఉన్నారు. కానీ.. టికెట్ విషయంలో అధినేత చూపు ఎవరిపై ఉందనేది కేసీఆర్ మెదక్ పర్యటన అనంతరం తేలిపోనుంది.

Updated Date - 2023-08-21T21:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising