ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest : చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?

ABN, First Publish Date - 2023-09-11T16:39:51+05:30

హౌస్ కస్టడీకి ఇవ్వాలని పదే పదే బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarthra Luthra) ఏసీబీ కోర్టును (ACB Court) అడిగిన విషయం తెలిసిందే. అయితే..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు హౌస్ కస్టడీ (CBN House Custody) విషయంలో ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే.. హౌస్ కస్టడీకి ఇవ్వాలని పదే పదే బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddarthra Luthra) ఏసీబీ కోర్టును (ACB Court) అడిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అనుమానం అంతా ఒక్కటే. అదేమిటంటే.. చంద్రబాబుకు జైలు సేఫ్ కాదు.. ఆయనకు ప్రమాదం పొంచి ఉన్నదే అనుమానం. అంతేకాదు తనకున్న పలు అనుమానాలను ఏసీబీ కోర్టు న్యాయవాదికి వినిపించారు. ‘చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది. చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు. చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది. అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వండి. మళ్లీ చెబుతున్నా.. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు. ప్రభుత్వం ఆయన సెక్యూరిటీ తగ్గించింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలులో ఉంది. చంద్రబాబుకు కేంద్రం హైసెక్యూరిటీ కల్పించింది’ అని లూథ్రా కోర్టుకు వివరించారు. అంతేకాదు.. గౌతమ్ నవలకర్ కేసులో హౌస్ రిమాండ్ ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును సైతం కోర్టులో సిద్ధార్థ ఉదహరించారు.


సీఐడీ తరఫున ఇలా..

కాగా.. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. చంద్రబాబు హౌస్ కస్టడీని సీఐడీ (CID) వ్యతిరేకిస్తోంది. ‘చంద్రబాబు ఆరోగ్య కారణాలను పరిశీలించాలి. సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉంది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే అదనపు సెక్యూరిటీ పెట్టాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇంటికంటే జైలే బెటర్ సేఫ్ ప్లేస్. చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్య ఉన్నారు. సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదు. రక్షణ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24X7 వైద్యులు అక్కడే ఉంచారు. అయన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వైద్యులు వహిస్తారు. అందుకే పిటిషనర్‌కు ఇల్లు కన్నా జైలే సేఫ్’ అని పొన్నవోలు కోర్టుకు వివరించారు. తన వాదనలకు కొనసాగింపుగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదన వినిపిస్తారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. అనంతరం సుబ్రమణ్యం వాదనలు ప్రారంభించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్నది.


ఇవి కూడా చదవండి


CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు


NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?


Updated Date - 2023-09-11T16:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising