ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayurveda: ఈ ఫుడ్స్‌ను కలిపి తీసుకుంటే రిస్కే! తప్పక పాటించాల్సిన ఆయుర్వేద సూత్రం ఇది!

ABN, Publish Date - Dec 23 , 2023 | 05:40 PM

కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయుదర్వే శాస్త్రం చెబుతోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనం వివిధ రకాల ఆహారపదార్థాలను కలిపి తీసుకుంటూ ఉంటాం. ఇది కొంత వరకూ మంచి అలవాటే. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలాంటి ఆహారాలను ‘విరుద్ధాన్న’ అని పిలుస్తారు. వీటి జోలికెళ్లొద్దని ఆయుర్వేదం చెబుతోంది (Food combinations to avoid according to ayurveda). ఇలాంటి కాంబినేషన్స్‌లో పదార్థాలను మితిమీరి తీసుకుంటే ఒక్కోసారి శరీరంపై ర్యాషెస్ లాంటివి కూడా రావొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏవో ఓసారి చూద్దాం పదండి.


  • ఇది చాలా మందికి తెలిసిందే. చేపలు, పాలు కాంబినేషన్ తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి రెండూ వేర్వేరు దోషాలకు చెందినవి కావడమే ఇందుకు కారణం.

  • కోడి గుడ్లు, బేకన్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను కలిపి తీసుకోకూడదు. దీని వల్ల కడుపులోని ఆహారం తొందరగా అరగదు. ఆయుర్వేదం ప్రకారం, తొలుత ప్రోటీన్లు తక్కువగా ఉన్న ఆహారాం, ఆ తరువాత ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్నవి తినాలి.

  • దగ్గు, జలుబుతో బాధపడేటప్పుడు పాలు, తులసీ ఆకులు తీసుకోవాలని కొందరు అంటారు. కానీ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

  • కొవ్వులు అధికంగా ఉండే పిజ్జాలు, కూల్ డ్రింక్స్ కాంబినేషన్ జోలికే వెళ్లొద్దు. త్వరగా జీర్ణం కాకుండా, శరీరం పీల్చుకోకుండా ఇవి ఒకదానికొకటి అడ్డుపడి అస్వస్థతకు గురి చేస్తాయి.

  • పాలను అరటి పళ్లు లేదా ఇతర పుల్లని పళ్లతో కలిపి తీసుకోకూడదు.

  • నెయ్యి, తేనెను 2 : 1 నిష్ఫత్తిలో మాత్రమే కలపాలి. వాటికి కచ్చితంగా ఇతర ఆహారపదార్థాలను కూడా జోడించాకే తినాలి. నెయ్యి, తేనె సమాన నిష్ఫత్తిలో ఉండటం శ్రేయస్కరం కాదని ఆయుర్వేదం చెబుతోంది.

  • కడుపులో పళ్లు త్వరగా జీర్ణం అవుతాయి, ఇతర ఆహారం కాస్తంత లేటుగా అరుగుతుంది. కాబట్టి, ఆహారం తీసుకున్నాక పళ్లను తినకూడదు.

  • స్టార్చ్ అనే చెక్కర పదార్థం ఎక్కువగా ఉండే బంగాళదుంపలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేస్తే అవి జీర్ణం కావడానికి చాలా టైం పట్టి కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది.

Updated Date - Dec 23 , 2023 | 05:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising