ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఈ ఫొటోలోని పాప నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది.. నిండా 12 ఏళ్ల వయసు కూడా లేదు.. అప్పుడే రిటైర్మెంట్..!

ABN, First Publish Date - 2023-08-01T20:51:17+05:30

ఆ బాలిక వయసు నిండా 12 ఏళ్లు కూడా కాదు.. స్కూలుకు వెళ్లి హోంవర్క్ చేసుకోవాల్సిన వయసు.. చాక్లెట్లు, బిస్కెట్లకు డబ్బులు కావాలి అంటూ మారాం చేసే వయసు.. అయితే ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్ అనే బాలిక పదేళ్లకే ఓ సంస్థకు సీఈవో అయిపోయింది.. నెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తోంది..

ఆ బాలిక వయసు నిండా 12 ఏళ్లు కూడా కాదు.. స్కూలుకు వెళ్లి హోంవర్క్ చేసుకోవాల్సిన వయసు.. చాక్లెట్లు, బిస్కెట్లకు డబ్బులు కావాలి అంటూ మారాం చేసే వయసు.. అయితే ఆస్ట్రేలియా (Australia)కు చెందిన పిక్సీ కర్టిస్ (Pixie Curtis) అనే బాలిక పదేళ్లకే ఓ సంస్థకు సీఈవో అయిపోయింది.. నెలకు కోటి రూపాయల వరకు సంపాదిస్తోంది.. అంతేకాదు 12 ఏళ్ల వయసులోనే రిటైర్ (Retirement) కూడా అయిపోతోంది. పిక్సీ చిన్న నాటి నుంచే చాలా చురుగ్గా ఉండేది. తల్లి రాక్సీ జెసెన్కో ప్రోత్సాహం కూడా తోడు కావడంతో పిక్సీ చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేసింది.

పిక్సీ చిన్న వయసులోనే పలు సంస్థల ఉత్పత్తులకు మోడల్‌గా పని చేసింది. పిక్సీస్ బౌ పేరిట హెయిర్ బౌస్ అమ్మింది. కరోనా సమయంలో పిక్సీ ఆటబొమ్మల అన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. 2021లో తల్లి రాక్సీతో కలిసి ``పిక్సీస్ ఫిడ్జెట్స్`` (Pixie’s Fidgets) పేరుతో ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆ స్టోర్ సూపర్ సక్సెస్ అవడంతో పిక్సీ దశ తిరిగింది. నెలకు కోటి రూపాయలకు పైగానే సంపాదన వచ్చేది. పిక్సీకి స్వంతంగా ఓ బెంజ్ కారు కూడా ఉంది.

Lift: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 32 ఏళ్ల మహిళ.. మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే.. ఆమె ఎంత నరకం అనుభవించిందంటే..!

ఇన్ని రోజులూ ఆఫీస్ వర్క్‌తో బిజీగా గడిపిన పిక్సీ 12 ఏళ్లు నిండిన తర్వాత చదువుపై దృష్టి పెట్టాలనుకుంటోంది. ఈ నెల 16వ తేదీన పిక్సీ బర్త్ డే. ఆ రోజు నుంచి పిక్సీ ఆఫీస్ వర్క్ మానేసి హోమ్‌వర్క్‌పై శ్రద్ధ పెడుతుందట. కంపెనీ బాధ్యతలను తల్లికి అప్పగించి పిక్సీ పూర్తిగా చదువు మీద శ్రద్ద పెడుతుందట. ఏదేమైనా చిన్న వయసులోనే భారీగా ఆర్జించి, వెంటనే రిటైర్మెంట్ కూడా ప్రకటించిన పిక్సీ ఆస్ట్రేలియాలో పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది (Viral News).

Updated Date - 2023-08-01T20:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising