Tomato: స్మార్ట్‌ఫోన్ కొంటే 2 కేజీల టమాటా ఉచితం.. మొబైల్ షాప్ యజమాని వినూత్న ప్రకటన!
ABN, First Publish Date - 2023-07-09T10:30:58+05:30
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా సెగలు రేపుతోంది. టమాటా రేట్లు ఆకాశాన్ని తాకడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.150 దాటేసింది. టమాటా రేట్లపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా (Tomato) సెగలు రేపుతోంది. టమాటా రేట్లు (Tomato Cost) ఆకాశాన్ని తాకడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.150 దాటేసింది. టమాటా రేట్లపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. టమాటను బంగారం, డైమండ్‌తో పోల్చుతూ బోలెడన్నీ జోకులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అశోక్ నగర్‌కు చెందిన ఓ మొబైల్ షాప్ (Mobile Shop) ఓనర్ ట్రెండింగ్ టమాటాను తన బిజినెస్‌కు అనుకూలంగా మార్చుకున్నాడు. అశోక్ అగర్వాల్ అనే మొబైల్ షాప్‌ను నిర్వాహకుడు పెరిగిన టమాట ధరలను తన షాప్ ప్రచారానికి వాడుకుంటున్నాడు. తన దుకాణంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు (2KG tomato free on buying a smart phone). ఆ మేరకు ఫ్లెక్సీలు వేసి పబ్లిసిటీ కూడా చేశాడు. ఈ ప్రకటన స్థానికంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
Viral Video: తెలివైన బాతు.. ఆ పులిని ఎలా బోల్తా కొట్టించిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
చాలా మంది అతడి షాప్‌లో మొబైల్స్ కొనుగోలు చేసి, రెండేసి కేజీలు టమాటాలు ఉచితంగా అందుకున్నారు. టమాటాలు ఫ్రీ అని ప్రకటించిన తర్వాత తన షాప్‌లో సేల్స్ పెరిగాయని అశోక్ చెప్పడం గమనార్హం. ఏదైమైనా ఆశోక్ ప్రకటన కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అశోక్ స్ట్రాటజీపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-09T10:30:58+05:30 IST