ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

4 Tasks in June: పాన్, ఆధార్ లింక్ మాత్రమే కాదండోయ్.. జూన్ నెలలోనే తప్పకుండా చేయాల్సిన 4 ముఖ్యమైన పనులివీ..!

ABN, First Publish Date - 2023-06-22T16:33:45+05:30

జూన్ నెల ముగియడానికి ఇంకో 8రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో.. ఈ నెలలో చాలామంది కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కొన్ని ఉన్నాయి. ఆధార్-పాన్ లింక్ మాత్రమే కాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ బడ్జెట్ నిర్ణయాల కారణంగా చాలా ఆర్థికసంబంధ విషయాలు మే నెలాఖరుకు ఓ కొలిక్కి వస్తుంటాయి. వీటిలో కొన్ని జూన్ నెలలో కూడా పరిష్కరించుకునే వీలుంటుంది. జూన్ నెలలో వీటిని పరిష్కరించుకోలేకపోతే తరువాత ఏడాది మొత్తం ఎన్నో బెనిఫిట్స్ కోల్పోవాలి. మరెన్నో ఇబ్బందులు పడాలి. జూన్ నెల ముగియడానికి ఇంకో 8రోజులు మాత్రమే గడువు ఉన్న క్రమంలో.. ఈ నెలలో చాలామంది కంప్లీట్ చేయాల్సిన టాస్కులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

ప్రస్తుతం ఉద్యోగాల నుండి బ్యాంక్ లోన్లు, స్కాలర్షిప్ లు, పెన్షన్లు, ప్రభుత్వ పధకాలు ఇలా వేటికైనా ఆధార్ కార్డ్(Aadhaar card), పాన్ కార్డ్(Pan card) వీటిలో ఓ ఒక్కటి యాక్టీవ్ గా లేకపోయినా అందాల్సిన బెనిఫిట్స్ చేజారిపోతాయి. పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్(Pan card- Aadhar card link) అయి ఉండటం తప్పనిసరి. ఈ రెండూ లింక్ చేసుకోవడానికి గడువును జూన్ 30వరకు(Pan-aadhar link date June 30) పెంచారు. ఈలోపు పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి ఆధార్-పాన్ కార్డ్ లింక్ కంప్లీట్ చేయాలి.

Viral Video: రోడ్డుపై నడుస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా వాళ్ల దగ్గరకు వచ్చిందో బైక్.. ఎందుకొచ్చారో గ్రహించేలోపే ఊహించని ట్విస్ట్..!


ఎవరైనా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే త్వరగతిన ఆ పని పూర్తీ చేయాలి. EPFO తన గడువును మొదట మే3 వరకు నిర్ణయించింది. కానీ ఆ తరువాత జూన్ 26 వరకు గడువు పొడిగించింది(EPFO last date June 26). అధికపెన్షన్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే 26వ తేదీ లోపు పూర్తీ చేయాలి.

ఎస్బీఐ వారి అమృత్ కలాష్ పథకంలో(SBI Amrit kalash scheme) పెట్టుబడి పెట్టాలని అనుకునే వారికి ఈ ఏడాది ఇదే చివరి అవకాశం. ఈ పథకంలో పెట్టుబడికి మొదట ఫిబ్రవరి 15నుండి మార్చి31వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత జూన్ 30వరకు(SBI amrit kalash scheme last date June30) ఈ సమయం పొడిగించారు. జూన్ 30వతేదీ లోపు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు పెట్టుబడి పెట్టవచ్చు.

బ్యాంక్ లాకర్స్(bank lockers) విషయంలోనూ ఈ నెల 30 తుది గడువుగా నిలిచింది. బ్యాంక్ లాకర్ ఒప్పందాలకు రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్ 31, 2023 వరకు బ్యాంకులకు తుది గడువు ఇచ్చింది. ఈక్రమంలో లాకర్ తీసుకున్న ఖాతాదారుల నుండి ప్రతి బ్యాంక్ జూన్ 30వ తేదీలోపు కనీసం 50శాతం మంది నుండి సంతకాలు చేయించుకోవాలని నిబంధన పెట్టింది. అందువల్ల జూన్ 30వతేదీలోపు(bank lockers agreement last date June30) బ్యాంక్ లాకర్ల విషయంలో అగ్రిమెంట్ పూర్తీ చేయాలని బ్యాంకులు తమ లాకర్ ఖాతాదారులను కోరాయి.

Marriage: అమ్మ బాబోయ్.. ఇదేం వింత ఆచారం.. పెళ్లయ్యాక మొదటి మూడ్రోజులు వధూవరులకు వింత కండీషన్..!


Updated Date - 2023-06-22T16:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising