Viral: ఏం మనిషివయ్యా నువ్వు.. పెళ్లయిన 11 ఏళ్లలో ఏడుగురు కూతుళ్లు.. రెండు సార్లు అబార్షన్.. చివరకు మగబిడ్డ కావాలని..!
ABN, First Publish Date - 2023-08-04T19:51:58+05:30
సమాజం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నా దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. మగ పిల్లలే పుట్టాలని కోరుకోవడం, ఆడ పిల్లలను చులకనగా చూడడం మాత్రం మానడం లేదు.
సమాజం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా, మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నా దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. మగ పిల్లలే (Boy child) పుట్టాలని కోరుకోవడం, ఆడ పిల్లల (Girl child)ను చులకనగా చూడడం మాత్రం మానడం లేదు. కొడుకు పుడతాడనే ఆశతో ఎదురుచూడడం ఆపడం లేదు. రాజస్థాన్ (Rajasthan)లోని గంగానగర్ జిల్లాలో తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
హనుమాన్‌గఢ్ జిల్లాలో నివసించే రాణి అనే మహిళకు గంగానగర్ జిల్లాలో నివసిస్తున్న వ్యక్తితో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. మొదటి ఏడాదిలోనే రాణి గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భర్త, అత్తమామలు ఆగ్రహం చెంది ఆమెను ఇంటి నుంచి తరిమేశారు. ఆ తర్వాత మూడు నెలలకు రాణి మళ్లీ అత్తింటికి చేరింది. కొడుకు పుడతాడనే ఆశతో రాణిని ఆమె భర్త పిల్లల్ని కనే యంత్రంగా మార్చేశాడు. ఆమె ఏడుసార్లు కుమార్తెలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు సార్లు ఆమెకు గర్భస్రావం (Abortion) అయింది. అయినా భర్త మనసు సంతృప్తి చెందలేదు.
Snake vs Cow: పొలంలో తిరుగుతున్న ఆవుకు ఎదురుపడిందో పాము.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!
పదోసారి మళ్లీ గర్భం దాల్చాలని రాణిని ఒత్తిడి చేశాడు. అందుకు రాణి నిరాకరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త రాణిని, ఏడుగురు కూతుళ్లను ఇంటి నుంచి తరిమేశాడు. ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టాడు. ఆమె బతికి ఉంటే మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉండదని గ్రహించి ఏకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటనలో ఆ వ్యక్తికి అతని తల్లిదండ్రులు కూడ సహకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు (Crime News).
Updated Date - 2023-08-04T19:51:58+05:30 IST