Viral News: 15 నిమిషాల్లో రూ.7 లక్షలు మటాష్.. ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఎలా కొట్టేశారో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-10-31T17:24:13+05:30
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. అడుగు బయటపెట్టకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోయి క్షణాల్లో డబ్బులు మాయమైపోతున్నాయి.
టెక్నాలజీ (Technology) అందుబాటులోకి వచ్చాక జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. అడుగు బయటపెట్టకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోయి క్షణాల్లో డబ్బులు మాయమైపోతున్నాయి. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆఫర్లు, గిఫ్ట్ కార్డులు అంటూ ఆశ పెట్టి డబ్బులు కాజేస్తున్నారు.
ప్రస్తుతం అలాంటి వాటిని ఎవరూ నమ్మకపోవడంతో కొత్త ప్లాన్ వేశారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ కొత్త పద్ధతి కనిపెట్టి ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుంచి ఏకంగా రూ.7 లక్షలు కొట్టేశారు. హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌కు చెందిన జయంత్ తివారీ అనే వ్యక్తి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్‌లో పని చేసి రిటైర్ అయ్యారు. సెప్టెంబర్ 27వ తేదీన అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ (Credit Card Reward points ) ఉపయోగించుకుని ఉచితంగా షాపింగ్ చేసుకోవాలని, అందుకోసం ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే జయంత్ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
Upcoming Smartphones in November 2023: మార్కెట్లోకి కొత్త ఫోన్లు.. నవంబర్ నెలలో లాంఛ్ అవబోతున్న స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదీ..!
ఆ యాప్ డౌన్‌లోడ్ అయిన కేవలం 15 నిమిషాల్లో జయంత్ ఖాతా నుంచి మొత్తం రూ.6.45 లక్షలు విత్ డ్రా అయిపోయాయి. బాధితుడు తన బ్యాంక్ డిటెయిల్స్ ఆ వ్యక్తికి చెప్పలేదు. అయితే ఆ వ్యక్తి తన ఫోన్‌లోని నోట్స్ యాప్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్ మాత్రం సేవ్ చేసుకున్నాడు. జయంత్ డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ను ఉపయోగించుకుని మొబైల్‌ను హ్యాక్ చేసిన దుండగుడు ఖాతాలోని డబ్బును కొట్టేశాడు. జయంత్ డౌన్‌లోడ్ చేసుకున్న ఆ మాల్‌వేరు (Malware) పేరు ర్యాట్ (RAT).. అంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. ఈ మాల్‌వేర్ ద్వారా మొబైల్ కెమేరాలను, మెసేజ్‌లను, కాల్ లాగ్‌ను, గ్యాలరీను కూడా హ్యాకర్లు తెరవగలరు.
Updated Date - 2023-10-31T17:24:13+05:30 IST