ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనకు 75 ఏళ్లు.. ఆమెకు 65 ఏళ్లు.. ఈ వయసులో పెళ్లేంటని అవాక్కవుతున్నారా..? అసలు వీళ్ల గతమేంటో తెలిస్తే మరింత షాకవుతారు..!

ABN, First Publish Date - 2023-02-17T16:19:58+05:30

ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఏ వయసులో పుడుతుందో చెప్పలేం అంటారు.. అచ్చం అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంట లేటు వయసులో ప్రేమలో పడింది.. వారి ప్రేమ ముందు వయసు ఓడిపోయింది.. గ్రామస్థులు వారిద్దరినీ చివరి దశలో ఒక్కటి చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఏ వయసులో పుడుతుందో చెప్పలేం అంటారు.. అచ్చం అలాగే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంట లేటు వయసులో ప్రేమలో పడింది.. వారి ప్రేమ ముందు వయసు ఓడిపోయింది (Oldage Love).. గ్రామస్థులు వారిద్దరినీ చివరి దశలో ఒక్కటి చేశారు.. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రాంనగర్ జిల్లాలో గురువారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకుంది. ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద నిర్వహించిన సామూహిక వివాహ సదస్సులో 75 ఏళ్ల వరుడు భగవాన్‌దీన్‌, 65 ఏళ్ల మోహానియా ఏడడుగులు వేశారు (Old Couple Marriage). రాంనగర్‌లోని దేవరీ పంచాయతీకి చెందిన భగవాన్‌దీన్‌ పుట్టుకతో వికలాంగుడు. అతను వివాహం చేసుకున్నాడు, కానీ పిల్లలు లేరు. అతని భార్య 11 సంవత్సరాల క్రితం మరణించింది. మరోవైపు, మొహానియా తన జీవితంలో పెళ్లే చేసుకోలేదు. వృద్ధాప్యంలో వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ గత పదేళ్లుగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు (Live-In).

ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన పథకం కింద గ్రామంలో కళ్యాణ సదస్సు జరగనుందని తెలుసుకున్న గ్రామస్తులు భగవాన్‌దీన్‌ని మొహానియాతో పెళ్లికి ఒప్పించారు. ఇద్దరూ పెళ్లికి అంగీకరించాడంతో వీరిని వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ అపూర్వ జంటను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామస్తులందరి మధ్య భగవందిన్ మరియు మోహనియా దంపతులుగా మారారు. రాష్ట్ర పంచాయితీ శాఖ మంత్రి రాంఖేలవన్ పటేల్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ రూ.11,000 చెక్కును, రూ.34,000 విలువైన గృహోపకరణాలు, ఆభరణాలను బహుమతిగా అందజేశారు.

Updated Date - 2023-02-17T16:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising