ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఇంటికి చేరని 8 ఏళ్ల కొడుకు.. మూడు గంటలు లిఫ్ట్‌లోనే.. ఒక్కడే ఏం చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-08-23T18:38:29+05:30

ఎంత పెద్ద వారైనా సరే లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే కాస్త కంగారు పడతారు. మూడు గంటల పాటు ఒక్కరే లిఫ్ట్‌లో ఉండాల్సి వస్తే పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. చాలా కంగారు పడతారు. అయితే ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మూడు గంటల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినా పెద్దగా టెన్షన్ పడలేదు.

ఎంత పెద్ద వారైనా సరే లిఫ్ట్‌ (Lift)లో ఇరుక్కుపోతే కాస్త కంగారు పడతారు. మూడు గంటల పాటు ఒక్కరే లిఫ్ట్‌లో ఉండాల్సి వస్తే పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. చాలా కంగారు పడతారు. అయితే ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు మూడు గంటల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినా పెద్దగా టెన్షన్ పడలేదు (8 year old child stuck in the lift). చక్కగా లిఫ్ట్‌లో కూర్చుని హోమ్‌వర్క్ పూర్తి చేశాడు (Home Work in Lift). బాలుడి ధైర్యాన్ని ఆ అపార్ట్ మెంట్ వాసులతో పాటు సోషల్ మీడియా జనాలు కూడా విపరీతంగా మెచ్చుకుంటున్నారు (Viral News).

గ్రేటర్ ఫరీదాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో పవన్ చండీలా కుటుంబం నివసిస్తోంది. పవన్ ఎనిమిదేళ్ల కొడుకు అదే అపార్ట్‌మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న టీచర్ దగ్గరికి రోజూ ట్యూషన్‌కు వెళతాడు. ఆదివారం కూడా రోజూలాగా ట్యూషన్‌కు బయల్దేరాడు. అయితే ఆ బాలుడు ఎక్కిన లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ బాలుడు కేకలు వేశాడు. ఎవరికీ వినబడకపోవడంతో బాలుడికి సాయం అందలేదు. కాసేపు ఎదురుచూసిన బాలుడు ఆ తర్వాత తన బ్యాగ్ ఓపెన్ చేసి తాపీగా హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు.

Yellow Teeth: పనికిరావని పారేసే అరటి తొక్కలతోనే.. పచ్చగా ఉండే పళ్లను తళతళా మెరిసేలా చేయొచ్చని తెలిస్తే..!

మూడు గంటల పాటు అలా లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. ఏమాత్రం కంగారు పడలేదు. ట్యూషన్‌కని వెళ్లిన కొడుకు ఇంకా రాకపోవడంతో పవన్ చండీలా టీచర్‌కు ఫోన్ చేశారు. ఆ అబ్బాయి అసలు ట్యూషన్ కే రాలేదని టీచర్ చెప్పారు. దీంతో ఆందోళన చెందిన పవన్ కొడుకు కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. అనుమానంతో లిఫ్ట్ ఓపెన్ చూసి చూడగా ఆ బాలుడు లోపల హోంవర్క్ చేస్తూ కనిపించాడు. లిఫ్ట్‌లో ఇరుక్కున్నా ఆందోళన లేకుండా హోంవర్క్ చేసుకున్న ఆ బాలుడి ధైర్యాన్ని అపార్ట్ మెంట్ వాసులు మెచ్చుకున్నారు. అంత డెడికేషన్ ఉంటే ఆ బాలుడు భవిష్యత్తులో ఐయేఎస్ అధికారి అవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-23T18:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising