ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: లిఫ్ట్‌ను వాడితే రూ.1000 జరిమానా.. పనిమనుషులు, డెలివరీ బాయ్స్‌కు హౌసింగ్ సొసైటీ వింత కండీషన్..!

ABN, First Publish Date - 2023-11-28T18:25:26+05:30

హైదరాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ పెట్టిన నిబంధన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ సొసైటీలో పని చేసే పని మనుషులు, సొసైటీకి వచ్చే డెలివరీ బాయ్స్‌ లిఫ్ట్ ఎక్కకూడదని ఓ రూల్ పాస్ చేసింది. ఆ రూల్‌ను అతిక్రమించి లిఫ్ట్ కనుక ఎక్కిత రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.

హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ హౌసింగ్ సొసైటీ (Housing Society) పెట్టిన నిబంధన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతోంది. ఆ సొసైటీలో పని చేసే పని మనుషులు (Maids), సొసైటీకి వచ్చే డెలివరీ బాయ్స్‌ లిఫ్ట్ (Lift) ఎక్కకూడదని ఓ రూల్ పాస్ చేసింది. ఆ రూల్‌ను అతిక్రమించి లిఫ్ట్ కనుక ఎక్కితే రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది (Fine to Maids). ఆ మేరకు ఓ నోటీస్‌ను లిఫ్ట్ డోర్‌కు అంటించింది. ఆ నోటీస్‌ను ఫొటో తీసిన ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ నోటీస్ తీవ్ర విమర్శల పాలవుతోంది.

చాలా మంది హౌసింగ్ సొసైటీ నిర్ణయాన్ని వివక్షపూరిత ప్రవర్తనగా పేర్కొంటూ విమర్శించారు. ``ఒక సమాజంగా మనం మన మురికిని, చీకటిని దాచుకోవడానికి ప్రోగ్రామ్ అయ్యాము. కష్టపడి పని చేసే మనుషులు మనతో సమానంగా ఉండకూడదని అనుకుంటున్నాం. ఒకవేళ అలా ఉంటే అది పెద్ద నేరం. వెయ్యి రూపాయల జరిమానా. బహుశా వారి జీతాల్లో 25 శాతం..`` అని ఆ నోటీస్ ఫొటో షేర్ చేసిన యూజర్ కామెంట్ చేశారు. ``విదేశాల్లో కార్మికులను ఎంతో గౌరవిస్తారు. అక్కడి వారు యజమానులతో సమానంగా కూర్చుని కాఫీ తాగుతారు`` అని మరొకరు కామెంట్ చేశారు.

Viral Video: పార్కులో ఒంటరిగా యువతి.. ఎలుగుబంటి ఏం చేసిందో మీరే చూడండి.. ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోతో..!

కాగా, కొందరు వ్యక్తులు ఆ నిర్ణయాన్ని సమర్థించారు. ఆ సొసైటీలో రెసిడెంట్ లిఫ్ట్‌లతో పాటు సహాయకుల కోసం వేరే లిఫ్ట్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. అందరూ రెసిడెంట్ లిఫ్ట్‌లు వాడడం వల్ల నివాసితులు ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోందని, ఇందులో ఎలాంటి వివక్షా లేదని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-28T18:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising