ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Husband: భార్యపై కోపంతో డేటింగ్ యాప్‌లో ఓ భర్త చాటింగ్.. కొద్ది రోజుల్లోనే ఓ యువతి పరిచయం.. ఇంటికి పిలిచిందని వెళ్తే..!

ABN, First Publish Date - 2023-11-24T20:37:02+05:30

ఆ వ్యక్తి ఘజియాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం భార్యతో అతడికి మనస్పర్థలు తలెత్తాయి.. భార్యతో మాటల్లేవు.. భార్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.. తన భార్యకు గుణపాఠం చెప్పేందుకు డేటింగ్ యాప్ సహాయం తీసుకున్నాడు..

ఆ వ్యక్తి ఘజియాబాద్‌ (Ghaziabad)లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం భార్యతో (Wife) అతడికి మనస్పర్థలు తలెత్తాయి.. భార్యతో మాటల్లేవు.. భార్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.. తన భార్యకు గుణపాఠం చెప్పేందుకు డేటింగ్ యాప్ (Dating App) సహాయం తీసుకున్నాడు.. అయితే అలా చేయడం అతడి కొంప ముంచింది.. తన భార్యకు బుద్ధి చెబుదామనుకున్న వ్యక్తి వేరే వాళ్ల ట్రాప్‌లో పడి సమస్యల పాలయ్యాడు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

ప్రతాప్‌విహార్‌లో ఉంటున్న ఓ వ్యక్తి అసిస్టెంట్‌ మేనేజర్‌‌గా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి తన భార్యతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతను తన మొబైల్ లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని దాంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. చాలా మంది అమ్మాయిలతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఒకమ్మాయి కాల్ చేసి మాట్లాడి తన ఇంటికి పిలిచింది. అడ్రస్ చెప్పింది. ఆమె చెప్పిన చోటుకు ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో అమ్మాయి లేకపోగా నలుగురు కుర్రాళ్లు ఉన్నారు (Crime News).

Divorce Case: విడాకులు కావాలంటూ పెళ్లయిన 2 నెలలకే కేసు పెట్టిన భార్య.. అసలేం జరిగిందని భర్తను అడిగితే..!

నలుగురూ కలిసి అతడిని కొట్టారు. అతడి బట్టలు తీసేసి అసభ్యకరమైన వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి జేబులో ఉన్న పర్సు తీసి క్రెడిట్ కార్డు నుంచి రూ.40 వేలు బదిలీ చేసుకున్నారు. ఆ తర్వాత బాధితుడిని వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-11-24T20:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising