Rider Hits Girl Back: నడిరోడ్డుపై అర్ధనగ్నంగా యువతి డ్యాన్స్.. జూ.ఎన్టీఆర్‌లా చెలరేగిన యువకుడు.. అక్కడ లాగి కొట్టాడు
ABN, First Publish Date - 2023-07-30T21:29:39+05:30
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన ‘నా అల్లుడు’ సినిమాని మీరు చూశారా? అందులో తారక్‌కి ఒక బలహీనత ఉంటుంది. తన ముందు ఎవరైనా (ముఖ్యంగా లేడీస్) వంగితే..
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన ‘నా అల్లుడు’ సినిమాని మీరు చూశారా? అందులో తారక్‌కి ఒక బలహీనత ఉంటుంది. తన ముందు ఎవరైనా (ముఖ్యంగా లేడీస్) వంగితే.. వెంటనే తారక్ వారి బ్యాక్ మీద లాగి ఒకటి కొడతాడు. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రియల్ లైఫ్‌లో ఒకటి వెలుగు చూసింది. ఓ యువతి నడిరోడ్డుపై అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో కాస్త వంగినప్పుడు.. ఓ యువకుడు సడెన్‌గా ఊడిపడి, తారక్‌లాగే ఆమె బ్యాక్ మీద లాగి కొట్టాడు. ఇప్పుడు వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఏముందంటే.. రీల్స్ పిచ్చి ఉన్న ఓ యువతి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తోంది. ఆ రోడ్డంతా తనదే అన్నట్టుగా ఎవరినీ పట్టించుకోకుండా.. వయ్యారాలు ఒలకబోస్తోంది. వెనకాల ట్రాఫిక్ స్థంభించిపోయినా పట్టించుకోకుండా, డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఇంతలో స్టెప్ మార్చి, వంగుతూ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అప్పుడు ఒక అబ్బాయి సడెన్‌గా ఊడిపడ్డాడు. బైక్ తోలుకుంటూ రయ్యున వచ్చిన అతగాడు.. ఆమె బ్యాక్ మీద ఒక దెబ్బ కొట్టి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. అతడు కొంచెం గట్టిగానే కొట్టడంతో.. పాపం ఆ యువతి బాధ భరంచలేక గట్టిగా కేక వేసేసింది. ఈ హఠాత్పరిణామంతో.. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి కూడా రికార్డ్ ఆపేశారు.
ఈ వీడియోని బోర్నకాంగ్ (@Bornakang) అనే బ్లూ టిక్ యూజర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఆ అబ్బాయి చేసిన పనిని నిందించలేమంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నడిరోడ్డుపై డాన్స్ చేస్తే.. ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని కొందరు చెప్తున్నారు. మరికొందరేమో.. అమ్మాయిల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ఆ అబ్బాయిని నిందిస్తున్నారు. ఇంకొందరేమో.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
Updated Date - 2023-07-30T21:29:39+05:30 IST