Shocking: చేపలు ఎక్కువగా తింటుంటారా? ఫిష్ తిని కాళ్లు, చేతులు పోగొట్టుకున్న మహిళ.. అసలు కథేంటంటే..
ABN, First Publish Date - 2023-09-18T18:35:03+05:30
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే చేపలను తినేందుకు నాన్-వెజ్ ప్రియులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. చేపలు తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి లభిస్తాయని చెబుతుంటారు. అయితే చేపలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పలేం. అప్పడప్పుడు చేపలు తినడం వల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే చేపలను (Fish) తినేందుకు నాన్-వెజ్ ప్రియులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. చేపలు తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి లభిస్తాయని చెబుతుంటారు. అయితే చేపలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పలేం. అప్పడప్పుడు చేపలు తినడం వల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు. తాజాగా అమెరికా (America)లోని కాలీఫోర్నియాలో ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది (Shocking News).
చేపలు తినడం వల్ల ఓ మహిళ తన రెండు చేతులు, రెండు కాళ్లను కోల్పోయింది. ఆ విషయం తెలుసుకుని చాలా మంది అవాక్కవుతున్నారు. కాలీఫోర్నియా (California)కు చెందిన 40 ఏళ్ల లారా బరాజాస్ అనే మహిళ స్థానిక మార్కెట్లో టిలాపియా చేపలను (Tilapia Fish) కొని ఇంటికి తీసుకెళ్లి వండింది. అనంతరం ఆ చేపలను భోజనంతో కలిసి తింది. ఆ తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆమె తిన్న చేపలో విబ్రియో వల్నిఫికస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని, అది తిన్న లారా తీవ్ర ఇన్ఫెక్షన్‌కు (Bacterial infection) గురైంది.
Emotional Video: నాన్నకు ఖరీదైన ఉంగరం బహుమతిగా ఇచ్చిన కూతురు.. ఆ తండ్రి రియాక్షన్ ఏంటంటే..
లారా బరాజాస్ నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఆమెకు గురువారం ఆపరేషన్ చేశారు. ఇన్ఫెక్షన్ సోకి నల్లగా మారిపోయిన రెండు కాళ్లు, రెండు చేతులను పూర్తిగా తొలగించారు. కాగా, ఆ చేపలు పూర్తిగా ఉడకలేదని, అందువల్లే బ్యాక్టీరియా చనిపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా చేపలు తిని రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోయిన ఉదంతం గురించి తెలుసుకుని అందరూ షాకవుతున్నారు.
Updated Date - 2023-09-18T18:37:01+05:30 IST