ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకునే ప్రయత్నంలో కుర్రాడు.. కోర్టు మెట్లెక్కిన తండ్రి.. వీరి కథేంటంటే..

ABN, First Publish Date - 2023-03-02T12:11:44+05:30

అబ్బాయిని అమ్మాయిగా మార్చుకునే ప్రయత్నంలో ఏకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ మధ్యకాలంలో అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ కంటే అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య ప్రేమ ఎక్కువయ్యింది. ఎక్కడ చూసినా సేమ్ జెండర్ మధ్య ప్రేమ వ్యవహారాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ప్రేమ అంటూ జెండర్ మార్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. తను ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకునే ప్రయత్నం చేశాడొక కుర్రాడు. దీనికోసం హార్మోన్స్ ఛేంజ్ ట్రీట్మెంట్ అంటూ డబ్బు కూడా ఖర్చుచేశాడు. ఈ కుర్రాళ్ళ కుటుంబాలు ఉలిక్కిపడ్డాయి. వీరిని గందరగోళంలోకి నెట్టేసిన ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుంటే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్(Bhopal) లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.ఓ కుర్రాడు స్థానిక కాలేజిలో బిఈ మొదటి సెమిస్టర్(B.E First Semister) చదువుతున్నాడు. ఇతను తన తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లల తరువాత కలిగిన సంతానం. ఇంట్లో అబ్బాయి గదిని శుభ్రం చేస్తుండగా ఒక టాబ్లెట్స్ బాటిల్ కనిపించింది అతని అక్కకు. అవి ఏం టాబ్లెట్స్ అని ఆరా తీయగా హార్మోన్స్ ఛేంజ్ టాబ్లెట్స్(Hormons Change Tablets) అని, అబ్బాయిలలో అమ్మాయిల లక్షణాలు డవలప్ కావడానికి అని ఉపయోగిస్తారని తెలిసి కంగుతినింది. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఆయన కొడుకును గట్టిగా నిలదీశాడు. అబ్బాయి చదువుతున్న కాలేజిలో ఓ కుర్రాడు ఉన్నాడని, తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని ఆ కుర్రాడు తండ్రికి సమాధానం ఇచ్చాడు.కాలేజీలో చదువుతున్న మరొక కుర్రాడు ఇతడిని అమ్మాయిలా భావిస్తున్నాడు. తన గతజన్మలో తను ప్రేమించిన అమ్మాయే ఇతనని నమ్ముతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేస్తానని అన్నాడు. అతను అనుకున్నట్టు తను ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకోవడానికి ఏకంగా హార్మోన్స్ మార్పుకోసం మందుల గురించి తెలుసుకుని వాటిని వాడించడం మొదలుపెట్టాడు. దీనికోసం ఇప్పటి వరకు 80వేల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలిసింది. కాగా వీరిద్దరి విషయం రెండు కుటుంబాలలో చాలా గందరగోళం సృష్టించింది.

Read also: Viral Video: ఈ బుడ్డొడికి ఎంత ధైర్యం..బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఏం చేస్తున్నాడో చూస్తే షాకవుతారు..


హార్మోన్స్ మార్పు కోసం మందులు వాడుతున్న కుర్రాడి తండ్రి ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. ప్రేమ పేరుతో తమ కొడుకును ఇలా మార్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కొడుకును అమ్మాయిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న కుర్రాడి పైనా, ఆ కుర్రాడి కుటుంబం పైనా కేసు పెట్టాలనుకుంటున్నాడు.జిల్లా కోర్టులో అప్పీలు చేసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. ఈయన తన కొడుకుకు చాలా సార్లు ఎంతో ఓపికగా చెప్పి చూశాడట. కానీ తన కొడుకు పూర్తిగా కుర్రాడి మాయలో పడిపోయాడని అమ్మాయిగా మారాలనుకుంటున్న అబ్బాయి తండ్రి చెప్పుకొచ్చాడు. 'అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, అందుకే నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నాను' అని చెబుతున్నాడట.ఈ కుర్రాళ్ళను ఇద్దరినీ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి మరీ కౌన్సిలింగ్ ఇప్పించారు కానీ కుర్రాళ్ళలో ఎలాంటి మార్పు లేదు.కాగా అమ్మాయిగా మారడానికి హార్మోన్స్ మందులు వాడుతున్న అబ్బాయి వయసు 19సంవత్సరాలని తెలిసింది.

Updated Date - 2023-03-02T12:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!