Aamir Khan: ఆ కారణంతోనే నటనకు బ్రేక్

ABN, First Publish Date - 2023-02-11T16:12:42+05:30

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). నటనలో పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. అందువల్ల అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు.

Aamir Khan: ఆ కారణంతోనే నటనకు బ్రేక్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). నటనలో పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తుంటారు. అందువల్ల అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అని పిలుస్తుంటారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే రూ.100కోట్లు, రూ.200కోట్ల కలెక్షన్స్ క్లబ్‌ను ప్రారంభించింది ఆయనే. చివరగా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) లో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే, అందరికీ షాకిస్తూ ఆమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు గల కారణాన్ని వెల్లడించారు.

ఆమిర్ ఖాన్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా పాల్గొన్నారు. నటనకు విరామం ఇవ్వడానికి గల కారణాన్ని తెలిపారు. ‘‘నేను సినిమా చేస్తున్నప్పుడు అదే విషయంపై దృష్టి సారిస్తాను. ఫలితంగా నా వ్యక్తిగత జీవితానికి సమయం చిక్కడం లేదు. అందువల్లే నటనకు బ్రేక్ ఇవ్వాలనుకున్నాను. ‘లాల్ సింగ్ చడ్డా’ అనంతరం నేను ‘ఛాంపియన్స్’ చేయాలి. అద్భుతమైన స్క్రిఫ్ట్ ఇది. కానీ, నటన నుంచి బ్రేక్ తీసుకున్నాను. నేను గత 35ఏళ్లుగా పని చేస్తున్నాను. దగ్గరి వారికి సమయాన్నిఇవ్వలేదు. అందువల్లే నా తల్లి, పిల్లలు, కుటుంబంతో సమయాన్ని వెచ్చించాలనుకున్నాను. జీవితాన్ని కొత్తగా అనుభూతి చెందాలనుకుంటున్నాను’’ అని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఈ స్టార్ హీరో నటనకు బ్రేక్ ఇచ్చినప్పటికీ వివిధ ఇండస్ట్రీస్‌కు చెందిన డైరెక్టర్స్ కథలు వినిపిస్తున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘కెజియఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘ఎన్‌టీఆర్31’ లో నటించాలని కోరారట. ఆమిర్ మాత్రం తన అంగీకారం మాత్రం తెలపలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌లోను ఆమిర్ కనిపించనున్నారని వదంతులు షికార్లు కొడుతున్నాయి.

Updated Date - 2023-02-11T16:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising