AC and Coolers: ఏసీ, కూలర్లను తెగ వాడేస్తున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో వేలల్లో వచ్చే కరెంట్ బిల్లు వందల్లో రావడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-04-24T14:55:36+05:30
వేసవిలో ఏసీ, కూలర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ వాడకానికి తగ్గట్టే కరెంట్ బిల్లు మోత మోగుతుంది. నెలంతా ఏసీ, కూలర్ల నీడలో చల్లబడినవారికి కరెంట్ బిల్లు చేతికొచ్చిందంటే షాకు కొట్టినంత పనవుతుంది. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే మాత్రం ఈ టిప్స్ పాటించాలి
ఇప్పట్లో ప్రతి ఇంట్లో కనీసం కూలర్ అయినా ఉంటోంది. సాధారణ సమయాల్లో కంటే వేసవిలో ఏసీ, కూలర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ వాడకానికి తగ్గట్టే కరెంట్ బిల్లు మోత మోగుతుంది. నెలంతా ఏసీ, కూలర్ల నీడలో చల్లబడినవారికి కరెంట్ బిల్లు చేతికొచ్చిందంటే షాకు కొట్టినంత పనవుతుంది. వేలకొద్దీ కరెంట్ బిల్లు సగటు మధ్యతరగతి, పేద కుటుంబాలకు గుదిబండ లాగే మారుతుంది. అయితే ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ లు అవసరమైనంత వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే మాత్రం ఈ టిప్స్ పాటించాలి.
కరెంట్ బిల్(Electricity bill) తక్కువ రావాలి అనుకునే ముందు ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత జాగ్రత్తగా మైంటైన్ చేయాలి. ఏసీ, కూలర్, ఫ్యాన్ ఏదైనా సరే.. కొనేముందు స్టార్ రేటింగ్(star rating) ఉన్న దాన్ని ఎంచుకోవాలి. తక్కువ ధరకే వస్తుంది కదా అని స్టార్ రేటింగ్ లేనివి తీసుకుంటే అవి విద్యుత్ ఎక్కువగా వినియోగించుకుంటాయి.
ఏసీ(AC) వినియోగించేవారికి చాలా ఈజీగా 2నుండి 3వేల బిల్లు వస్తుంది. అలా రాకూడదంటే ఏసీని ఎప్పుడూ 24డిగ్రీల(AC temperature set at 24degrees) దగ్గర ఉంచాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ.. తక్కువ మాత్రం ఉంచకూడదు. 24డిగ్రీల కంటే తక్కువలో ఉంచితే ఏసీలో కంప్రెస్సర్(compressor) ల మీద ఒత్తిడి పెరిగి విద్యుత్ ఎక్కువగా ఖర్చవుతుంది.
ఫ్రిజ్ లు చాలా పాతగా(old fridge) అయిపోయి ఉంటే అవి కరెంట్ ను ఎక్కువగా వినియోగించుకుంటాయి. స్టార్ రేటింగ్ లేని ఫ్రిజ్ లు కొనుగోలు చేయడం వల్ల నెలనెలా కరెంట్ బిల్లులో మీ జేబుకు చిల్లు తప్పదు. ఇది కేవలం వేసవిలోనే కాదు ఆ ఫ్రిజ్ వాడినన్ని ఏళ్ళు కొనసాగుతుంది. ఫ్యాన్లను కొనుగోలు చేసేటప్పుడు కాపర్ వైండింగ్(copper winding fan) ఉన్న ఫ్యాన్లను కొనుగోలు చేయాలి. ఇవి తక్కువ కరెంట్ వినియోగించుకుంటాయి.
అందరూ చేసే పొరపాట్లలో ముఖ్యమైనది.. గదులలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్, లైట్ ఆఫ్ చేయకుండా అలాగే వదిలేయడం. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆన్ లో ఉంచేయడం ఇలా చేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది.
త్రీపేజ్ కనెక్షన్(3-phase connection) అన్నివిధాలా మంచిది. ముఖ్యంగా లో వోల్టేజ్(low voltage) సమయంలో కరెంట్ వినియోగం అధికం కాకుండా ఇది సహాయపడుతుంది. అలాగే 240 వోల్ట్స్ కంటే ఎక్కువ కరెంట్ సరఫరా అయినా వస్తువులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది.
మీది పాత ఇల్లు అయితే ఆ ఇంట్లో ఏసీ వంటి అధిక విద్యుత్ వినియోగించే వస్తువులుంటే వైరింగ్ కొత్తగా చేయించాలి. పాత వైర్ల ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రవాహం వల్ల ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్(short circuit) జరిగి అగ్నిప్రమాదాలు(fire accidents) ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎర్తింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏవైనా లోపాలున్నా వోల్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వైర్లు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటిని విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి నెలా విద్యుత్ వినియోగంలో సుమారు 25యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
Updated Date - 2023-04-24T14:55:36+05:30 IST