AC: ఏసీ ఆన్ చేయగానే కొందరికి ఎందుకిలా జరుగుతుంది..? చాలా మందికి తెలియని నిజాలివి..!
ABN, First Publish Date - 2023-04-12T14:22:43+05:30
ఏసీతో చల్లగా హాయిగా ఉండటమే చాలామందికి తెలుసు కానీ
కుతకుతలాడే ఎండలకు చల్లగా ఏసీలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో .. కానీ చాలామందికి అలా ఏసీలో కూర్చోగానే ఇలా సమస్యలు మొదలవుతాయి. చాలామంది ఇంట్లోనూ, ఆఫీసు గదులలోనూ ఏసీ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే నిజంగానే ఏసీ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? ఏసీతో చల్లగా హాయిగా ఉండటమే చాలామందికి తెలుసు కానీ జలుబు(Cold), తలనొప్పి(Headache), కళ్ళు మండటం(Eyes burning) వంటి బోలెడు సమస్యలు ఒకదాని వెనుక ఒకటి ఎందుకొస్తాయి? నిజంగానే సమస్యలు ఏసీ వల్లనే వస్తున్నాయా లేక అవన్నీ అపోహలా? వీటి వెనుక ఏదైనా కారణం ఉందా? చాలా మందికి తెలియని షాకింగ్ నిజాలు ఇవే..
ఏసీ(Air conditioner)లో పనిచేసే చాలా మంది ఉద్యోగస్తులు జలుబు(Cold), కళ్ళ మంటలు(Eyes burning), గొంతు నొప్పి(Throat pain), శ్వాస తీసుకునేటప్పుడు గురక(snoring while breathing) వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి ఏసీనే కారణమని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఈ సమస్యలకు ముఖ్యకారణం ఏసీ కాదు. సాధారణంగా ఏసీలో ఎయిర్ ఫిల్టర్(Air Filters) లు ఉంటాయి. ఇవి గాలిని శుద్ది(Purify) చేసి చల్లని గాలి(Cool air)ని బయటకు వదులుతాయి. ఒక గదిలో వినియోగించే ఏసీలో ఫిల్టర్లను ప్రతి 10రోజులకు ఒకసారి క్లీన్ చేస్తుండాలి(Air filters should be cleaned once in 10 days) . అలాగే ప్రతి 3నెలలకు ఒకసారి ఆ ఫిల్టర్లను ఛేంజ్ చేస్తుండాలి(Air filters should be changed once in 3months). ఇలా చేయని పక్షంలో ఆ ఫిల్టర్ లలో చిక్కుకుపోయిన వైరస్, బ్యాక్టీరియా(Virus, Bacteria) తిరిగి గాలి ద్వారా గదులలోకి ప్రసరిస్తాయి. ఈ గాలిని కలుషితమైనదిగా చెప్పవచ్చు. దీన్ని పీల్చుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా శ్వాసనాళాలలో(respiratory system) చేరి అది గొంతునొప్పి, తలనొప్పి, శ్వాస నాళాలు బ్లాక్ అయ్యేలా చేస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకునే సమయంలో గురక ఏర్పడుతుంది. ఈ సమస్యను సిక్ బిల్డింగ్ సిండ్రోమ్(sick building syndrome) అని అంటారు.
Viral News: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ తల్లీ.. బస్సులో ఒక్కతే ఉండటంతో డ్రైవర్, కండక్టర్ పిచ్చి చేష్టలు.. సీట్లో కూర్చునే వాళ్ల ఆట కట్టించింది..!
ఏసీ ఉన్నగదిలో గాలి వెలుతురు సరిగా లేకపోవడం(air-light system), దుమ్ము, ధూళి(dust) ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటే ఆ గది వాతావరణం కలుషితం అవుతుంది. ఇదే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా మగవారికంటే ఆడవారే ఈ సమస్య బారిన తొందరగా పడతారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే చాలా సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో తేమ శాతం తొందరగా కోల్పోతే అది శరీరం పొడిబారడానికి(dehydrate) దారితీస్తుంది. ఇది తలనొప్పి, రక్తపోటు పెరుగుదల(blood pressure), అలసట(fatigue), నీరసం(boredom) వంటి సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఏసీ గది నుండి బయటపడినప్పుడు బానే అనిపిస్తుంది కానీ తిరిగి ఏసీ గదిలో కూర్చోగానే సమస్యలు మొదలవుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా(Low immunity) ఉన్నవారు, శ్వాస సంబంధ సమస్యలున్న(Breathing issues)వారు ఏసీ వాతావరణంలో పనిచేయడం వల్ల మరింత సిక్ అవుతారు. ఏసీకి అలవాటు పడితే చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది. ఈ కారణంగా కాస్త వేడి, ఎండ తగిలినా చర్మం భరించలేనివిధంగా తయారవుతుంది.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ఏసీలో పనిచేసేవారు ఏసీ ఫిల్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫిల్టర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి.
శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. నీరు బాగా తాగాలి. ఎక్కువ సేపు ఏసీ కింద పనిచేసేవారు చిన్నచిన్న బ్రేక్ లు తీసుకుని ఆ వాతావరణం నుండి బయటకు వెళుతుండాలి.
ఎప్పుడూ 25 నుండి 27 డిగ్రీల మధ్య ఏసీ ఉష్ణోగ్రత ఉంచాలి. కళ్లు పొడిబారకుండా ఉండటానికి వైద్యులను సంప్రదించి కంటి చుక్కలు, లేదా కళ్ళజోడు ఉపయోగించాలి. నీటితో కళ్ళను తడుపుకుంటూ ఉండాలి.
Viral Video: రైతన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఓ ఖాళీ బీరు బాటిల్‌ను, ఓ మొబైల్ పౌచ్‌ను కలిపి ఇలా చెట్టుకు ఎందుకు వేళాడదీశాడో చూస్తే..
Updated Date - 2023-04-12T14:22:43+05:30 IST