ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railways: తరచూ రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు కూడా ఈ రూల్స్ తెలిసి ఉండవు.. కింద బెర్తుల్లో టికెట్లు కన్ఫామ్ కావాలంటే..!

ABN, First Publish Date - 2023-06-07T15:35:10+05:30

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే మనకు సౌకర్యవంతమైన సీట్ మాత్రం బుక్ కాదు. కాస్త వయసు పైబడిన వాళ్ళకు ఎక్కడో అప్పర్ బెత్ వస్తుంది.

Indian Railways
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామూలు మధ్యతరగతి కుటుంబీకులు ప్రయాణాలు చేయాలంటే రైలు ప్రయాణాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. కారణం భద్రత, వేగం, తక్కువ ధరకావడం కూడా కారణాలు. అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే మనకు సౌకర్యవంతమైన సీట్ మాత్రం బుక్ కాదు. కాస్త వయసు పైబడిన వాళ్ళకు ఎక్కడో అప్పర్ బెత్ వస్తుంది. కుర్రాళ్ళకు లోయర్‌లో బెర్త్ కన్ఫామ్ అవుతుంది. దీనికి కారణం ఏంటో కూడా సరిగా మనకు తెలీదు. అయితే భారతీయ రైల్వే లోయర్ బెర్త్‌లకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఎక్కడికైనా వెళ్ళాలని ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటుంటే కనుక లోయర్ బెర్త్‌కు సంబంధించిన ఈ నియమాలను తెలుసుకోండి.

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైల్వేలో ప్రయాణిస్తుంటారు, దీని కోసం రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను తీసుకువస్తుంది లేదా సౌకర్యాలను కల్పిస్తుంది. దీని గురించి కొందరికి మాత్రమే తెలుస్తుంది. అసలు మనకు కావలసిన విధంగా బెర్త్ కన్ఫామ్ కావాలంటే.. రైలులో ప్రయాణించి, లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, బుక్ చేసుకునే ముందు ఈ నియమాలను తెలుసుకోవాలి.

లోయర్ బెర్త్ కొంతమందికి రిజర్వ్ చేయబడిందని భారతీయ రైల్వే చెబుతుంది. వారికే ముందుగా ఈ సీటు ఇస్తారు. ఆ తర్వాత మరో బెర్త్ మిగిలిపోతే మిగతా వాళ్లకు ఇస్తారు. ఈ లోయర్‌ బెర్త్‌ను శారీరక వికలాంగులకు ముందుగా కేటాయిస్తారు. ఆపైన రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లు, మహిళలకు విభజిస్తారు.

ఇది కూడా చదవండి: రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికుడు అద్భుతం చేశాడుగా.. ఇతని కథగానీ మీరు చదివారో..!

రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం స్లీపర్ క్లాస్‌లో నాలుగు సీట్లు, ఏసీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయి. గరీబ్ రథ్ రైలులో కూడా వికలాంగులకు రెండు సీట్లు కేటాయించబడ్డాయి. అదే సీనియర్‌ సిటిజన్‌లకు అడగకుండానే బెర్త్‌లు ఇస్తారు.

మరోవైపు గర్భిణి ఉంటే ఆమెకు లోయర్ బెర్త్ కూడా ఇస్తారు. IRCTC వెబ్‌సైట్‌ని సందర్శించినపుడు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్న విధంగా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే వయసును బట్టి, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈసారి మీకు కావలసినట్టుగా ప్రయాణించండి.

Updated Date - 2023-06-07T15:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising