Aditi Rao Hydari Dating: జనాలకు ఓ టాపిక్‌ కావాలి.. అది వాళ్ల ఇంట్రెస్ట్‌!

ABN, First Publish Date - 2023-03-06T15:01:48+05:30

హీరో సిద్థార్థ్‌(Siddharth), అదితీరావు హైదరి (డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆహ్వానాల మేరకు అప్పుడప్పుడూ వీరిద్దరూ పలు పార్టీలకు హాజరై కెమెరాలకు చిక్కడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.

Aditi Rao Hydari Dating: జనాలకు ఓ టాపిక్‌ కావాలి.. అది వాళ్ల ఇంట్రెస్ట్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హీరో సిద్థార్థ్‌(Siddharth), అదితీరావు హైదరి (Aditi Rao Hydari )డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆహ్వానాల మేరకు అప్పుడప్పుడూ వీరిద్దరూ పలు పార్టీలకు హాజరై కెమెరాలకు చిక్కడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా ఈ జంట తమిళంలో పాపులర్‌ అయిన ‘తుమ్‌ తుమ్‌’ పాటకు స్టెప్పులేశారు. ఆ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. (Aditi Rao Hydari Dating)

తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూమర్స్‌పై అదితీ స్పందించింది. ‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచి నేను ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోలేదు. సెలబ్రిటీల విషయంలో జనాలకు ఎప్పుడు ఓ టాపిక్‌ కావాలి. ఏదో ఒకటి మాట్లాడటమే వారికి కావాలి. అలా మాట్లాడుతూనే ఉంటారు. సో.. వాళ్లను మనం ఆపలేం. వాళ్లకు ఏది ఆసక్తో దాని కోసం వెతుకుతూ ఉంటారు. నాకు ఏది ఇష్టమో దాని కోసం నేను వెతుకుతుంటాను. నాకు నచ్చిన పనిలో ఎంతవరకూ చేయగలనో, ఏ దర్శకులతో పనిచేయడాన్ని ప్రేమిస్తానో, ప్రేక్షకులు నన్ను ఎంతకాలం ఆదరిస్తారో అప్పటి వరకూ చాలా సంతోషంగా ఉంటా’’ అని అదితిరావు హైదరీ చెప్పారు. (Aditi Rao Hydari reacts on Dating rumours)

అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ‘మహాసముద్రం’ చిత్రంలో సిద్థార్థ్‌కు జోడీగా అదితి నటించారు. ఈ చిత్రంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారిందని టాక్‌ వినిపిస్తోంది. ఇద్దరూ కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఒకే కారులో ట్రిప్‌లకు వెళ్తుంటారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి మాత్రం ఇప్పటి దాకా మాట్లాడలేదు.

Updated Date - 2023-03-06T15:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising