ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోషిమఠ్ తర్వాత ఇప్పుడు ఆ నగరంలో ఇళ్లకు పగుళ్లు...

ABN, First Publish Date - 2023-01-31T11:36:57+05:30

ఉత్తరాదిలోని జోషిమఠ్, లక్నో, ఆగ్రాలలో భవనాలకు పగుళ్లు వచ్చిన దరిమిలా ఇప్పుడు ప్రపంచంలోనే పురాతన నగరమైన కాశీలోని గంగా తీరానగల వేలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. కొత్తగా కట్టిన ఇళ్ల పైకప్పులు అస్తవ్యస్తంగా తయారువుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాదిలోని జోషిమఠ్, లక్నో, ఆగ్రాలలో భవనాలకు పగుళ్లు వచ్చిన దరిమిలా ఇప్పుడు ప్రపంచంలోనే పురాతన నగరమైన కాశీలోని గంగా తీరానగల వేలాది ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. కొత్తగా కట్టిన ఇళ్ల పైకప్పులు అస్తవ్యస్తంగా తయారువుతున్నాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న వందలాది కుటుంబాలవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ 400లకు పైగా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయని, దీనికి భవన యజమానిదే బాధ్యత అని తెలిపింది. కాశీలోని గంగాఘాట్‌ ఒడ్డున వేలాది ఇళ్లు ఒరిగిపోతున్న తీరు ఆందోళనను మరింత పెంచింది.

గంగానది ఒడ్డున కొన్ని ఇళ్లను చూస్తుంటే ఈ ఇళ్లు ఎప్పుడైనా పేకమేడలా కూలిపోయే పరిస్థితులున్నాయని చాలామంది అంటున్నారు. అలాగే వారణాసిలోని గంగా ఘాట్ ఒడ్డున బీటలువారుతున్న ఇళ్ల మధ్య, ఎలా బతకాలోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు సమస్యల పరిష్కారానికి ధర్నాకు దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అక్కడివారు అంటున్నారు. వారణాసి జిల్లాలో 100కుపైగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించామని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రాథమికంగా ఈ ప్రక్రియను మండల అధికారులు నిర్వహిస్తున్నారని, ఎటువంటి వివాదం లేకుంటే ఆ ఇంటిని కూల్చివేస్తామని పేర్కొంది.

Updated Date - 2023-01-31T11:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising