ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కూతురిది అసలు జుట్టు కాదు.. విగ్గు అని ఆ వరుడికి తెలిసింది.. బంధువులందరి ముందే ఆ పెళ్లికొడుకు చేసిన పనేంటంటే..

ABN, First Publish Date - 2023-02-24T18:58:04+05:30

బుధవారం సాయంత్రం ఆ వరుడు ఎంతో ఉత్సాహంగా ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు.. ఉల్లాసంగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. వరమాల కార్యక్రమం మొదలైంది.. అంతలో వరుడికి ఓ డౌట్ వచ్చింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుధవారం సాయంత్రం ఆ వరుడు ఎంతో ఉత్సాహంగా ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు.. ఉల్లాసంగా పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. వరమాల కార్యక్రమం మొదలైంది.. అంతలో వరుడికి ఓ డౌట్ వచ్చింది.. పెళ్లి కూతురికి జుట్టు (Bride`s Hair) లేదని, విగ్గు పెట్టుకుందని తెలిసింది.. వధువును నిలదీయగా అసలు విషయం తెలిసింది.. దీంతో వరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు (Groom called off marriage).. దీంతో పెళ్లి పందిట్లో గొడవ మొదలైంది (Viral News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అయోధ్యకు సమీపంలో ఉన్న జమోలి గ్రామానికి చెందిన వరుడు ఆనంద్ బుధవారం సాయంత్రం ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. పెళ్లి కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగాయి. వరుడు విందు భోజనం కూడా చేశాడు. వరమాల కార్యక్రమం జరుగుతుండగా వరుడికి ఓ విషయం తెలిసింది. వధువు తలపై వెంట్రుకలు తక్కువగా ఉన్నాయని, ఆమె విగ్ (wig) ధరించి వచ్చిందని వరుడికి ఎవరో చెప్పారు. అది విని పెళ్ళికొడుకు కోపమొచ్చింది. గొడవ ప్రారంభించి పెళ్లికి నిరాకరించాడు. ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. దీంతో వధువు తరఫు వారు మగపెళ్లి వారిని అడ్డుకున్నారు.

షాపుల్లో కొనే పాలు సేఫ్ అని అనుకుంటున్నారా...? ఈ వార్త చదివితే మార్కెట్లో పాలు కొనడానికి కూడా భయపడతారేమో..!

ఇరు వర్గాల నడుమ పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ మొదలైంది. పెళ్లి ఖర్చులకు తనకు రూ.6 లక్షలు అయ్యాయని, ఇప్పుడు పెళ్లి ఆపడం కుదరదని వధువు తండ్రి తెలిపాడు. మరోవైపు ఆ పెళ్లి చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వరుడు అంగీకరించలేదు. దీంతో వరుడి తరఫు వారు రూ.3 లక్షలు వెనక్కి ఇవ్వడానికి అంగీకరించారు. ఆ తీర్పుతో సంతృప్తి చెందని వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వరుడు, అతని తండ్రి సహా మొత్తం 9 మందిపై వరకట్న వేధింపుల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-02-24T18:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising