ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video:ఇండియా సంస్కృతి, ట్రెండ్స్‌కు అద్దం పడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలు, సోషల్ ‌మీడియాలో వైరల్

ABN, First Publish Date - 2023-05-21T21:56:33+05:30

కళకు, ఆర్టిఫిషియల్ నైపుణ్యతకు అవధుల్లేవు. ఈ వాస్తవం పదేపదే నిరూపించబడుతూనే ఉంది. AI రాకతో చూస్తే ఆర్టిస్టులకు హద్దులు లేవని తెలుస్తుంది. ఔరా..! అనిపించే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎదుగుతోంది. ఏదేని అంశంపై నిజమైన కథనాలు, ChatGPT ద్వారా ఎంట్రన్స్ పరీక్షల్లో నెగ్గడం, ఊహాజనిత పరిస్థితుల ఆర్టిఫిషియల్ ఇమేజ్‌లను రూపొందించడం వరకు ఏఐ ప్రతిచోటా తనమైన ముద్రవేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కళకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)(AI)కు అవధుల్లేవు. ఈ వాస్తవం పదేపదే నిరూపించబడుతూనే ఉంది. AI రాకతో చూస్తే ఆర్టిస్టులకు హద్దులు లేవని తెలుస్తుంది. ఔరా..! అనిపించే స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎదుగుతోంది. ఏదేని అంశంపై నిజమైన కథనాలు, ChatGPT ద్వారా ఎంట్రన్స్ పరీక్షల్లో నెగ్గడం, ఊహాజనిత పరిస్థితుల ఆర్టిఫిషియల్ ఇమేజ్‌(Images of Imaginary Circumstances)లను రూపొందించడం వరకు ఏఐ ప్రతిచోటా తనమైన ముద్రవేస్తోంది. అయితే తాజాగా సాహిద్(Sahid) ఓ ఆర్టిస్ట్ దేశంలోని వివిధ నగరాల్లో ‘‘మెట్రోలు’’ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే రెండు భాగాలను విడుదల చేశాడు. ఇది మూడవది.

ఈ భాగంలో కాన్పూర్, కోటా, సూరత్, హర్యానా, చెన్నై, ఛత్తీస్‌గఢ్, కన్యాకుమారి వంటి రాష్ట్రాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ మిడ్‌జర్నీ సమయంలో సృష్టించబడ్డాయి. ఆయా ప్రాంతాల ట్రెండ్స్, సాంప్రదాయాలను అద్భుతంగా చూపించాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పరిస్థితిని తెలుపుతూ ..ఒక వ్యక్తి 'విమల్' స్టాక్‌లను మోస్తూ కనిపిస్తాడు. హర్యానాకు సంబంధించి ఇమేజ్.. చాలా మంది తమ సాధారణ దుస్తులు ధరించి, కర్రలు పట్టుకుని విలక్షణమైన హర్యానా సంస్కృతికి అద్దం పడుతుంది. అయితే అత్యంత ఆసక్తికరంగా ఇమేజ్.. చెన్నైలో నటుడు రజనీకాంత్ మెట్రో లోపల కూర్చొని కనిపించారు.

“మైండ్ బ్లోయింగ్.. మన సంస్కృతి గురించి, వివిధ రాష్ట్రాల్లోని ట్రెండ్స్‌ను చాలా బాగా చూపించారు. గూగుల్‌లో చాలా డేటా ఉన్నప్పటికీ AI వీటిని చాలా ఖచ్చితంగా చూపించింది. చాలా అద్భుతంగా ఉంది” అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు రాశాడు. చాలా మంది దీనిని చూసి షాక్ అయ్యారు.

అయితే మొదటి సిరీస్‌లో సాహిద్ కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్‌లను రీ ఇమేజ్‌ చేసి చూపించాడు. సముద్ర ఆహారాన్ని ఎక్కువగా కోల్‌కతా ప్రజలు ఇష్టపడతారని.. దీనిని ప్రతిబింబించే విధంగా మెట్రో చేపలు అమ్ముతున్న వ్యక్తి ఉనికిని సృష్టించాడు. మరోవైపు గుజరాత్‌ ఎడిషన్‌లో ప్రసిద్ధ చిరుతిండి అయిన ఢోక్లాస్‌ను చూపించాడు. ముంబైఐకానిక్ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ ‘‘వడపావ్’’ కనిపిస్తుంది.

అదేవిధంగా రెండవ భాగంలో హైదరాబాద్, బెంగళూరు, నాగ్‌పూర్, ఒడిశా, కాశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని మెట్రో నెట్‌వర్క్‌లపై దృష్టి పెట్టాడు. హైదరాబాద్ మెట్రో వంటల స్వర్గధామంగా మారిందని, నాగ్‌పూర్‌ ప్రసిద్ధ నారింజలు, అలాగే బీహార్‌లో విక్రేత చేతిలో లిట్టీస్ కుప్పలు చిత్రాలలో చూపించాడు.

Updated Date - 2023-05-21T22:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising