Akkineni Nagarjuna: అదేంటో చెప్పను ప్లీజ్!
ABN, First Publish Date - 2023-02-24T10:40:56+05:30
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన స్కూలింగ్, అప్పటి అల్లర్లు, స్కూల్ ఏం నేర్పింది అన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల వేడుకకు నాగార్జున అతిథిగా హాజరయ్యారు
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన స్కూలింగ్, అప్పటి అల్లర్లు, స్కూల్ ఏం నేర్పింది అన్న విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల వేడుకకు నాగార్జున అతిథిగా హాజరయ్యారు(Nagarjuna Guest for Hydrabad public school 100 years Celebs). ఆయన మాట్లాడుతూ ‘‘ఐదేళ్ల వయసులో ఈ స్కూల్‌లో చేరాను. 15 ఏళ్లు వచ్చే వరకూ ఇక్కడే చదివా. అప్పట్లో మా ఇల్లు స్కూల్ దగ్గర్లోనే ఉండేది. ఒక్కో రోజు నడుచుకుంటూ, ఒక్కోసారి సైకిల్ మీద వచ్చేవాడిని. మా స్కూల్ 75 ఏళ్ల ఫంక్షన్‌ని వచ్చా. 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు అతిథిగా రావడం ఆనందంగా ఉంది. స్కూల్ గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే చిన్నప్పటి రోజులు కళ్ల ముందు మెదిలాయి. అప్పటి స్నేహితులు, ఆటలు, అల్లర్లు, ఎదిగిన జ్ఞాపకాలు, ఈ స్కూల్ నన్ను తీర్చిదిద్దిన విధానం ఒకటి కాదు.. చిన్నతనంలో మధుర జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అవన్నీ ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. లైఫ్ చాలా ఇంపార్టెన్స్ ఏంటనేది మా స్కూల్‌లోనే నేర్చుకున్నా, మనోధైర్యం అనేది మా టీచర్స్ నుంచి నేర్చుకున్నా(Nagarjuna Reveals His School Memories)’’ అని అన్నారు. ఇష్టమైన సబ్జెక్, భయపడే సబ్జెక్ గురించి అడగగా ‘అది చెప్పను’ అంటూ జారుకున్నారు. నాగచైతన్య, అఖిల్‌లతో స్కూల్ మెమరీస్ గురించి షేర్ చేసుకునేవాడినని, హ్యాపీగా ఉండండి, బాగా చదువుకోండి అని చెప్పేవాడినని అన్నారు నాగార్జున.
Updated Date - 2023-02-24T11:48:40+05:30 IST