ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akshay kumar: అది వంద శాతం నా తప్పే!

ABN, First Publish Date - 2023-02-26T16:12:57+05:30

బాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌ (Akshaykumar)మంచి హిట్‌ కోసం ఎదరుచూస్తున్నాడు. ఈ నెల 24న ‘సెల్ఫీ’తో (Selfie) ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ (Imram hashmi) ప్రధాన పాత్రల్లో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌ (Akshaykumar)మంచి హిట్‌ కోసం ఎదరుచూస్తున్నాడు. ఈ నెల 24న ‘సెల్ఫీ’తో (Selfie movie) ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ (Imram hashmi) ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేగా ఈ చిత్రం తెరకెక్కింది. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల్ని నిరాశపరిచింది. దీంతో అక్షయ్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. (akshy kumar about Failures) తన సినిమాల పరాజయాల గురించి చెప్పుకొచ్చారు. ‘‘నేను సినిమాల విషయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఒకనొక సమయంలో నేను నటించిన 16 (16 movie flop) సినిమాలు వరుసగా పరాజయం పాలై నిరుత్సాహపరిచాయి. అలాగే ఇంకోసారి రిపీట్‌ అయింది. చక్కని విజయం సాధిస్తాయనే నమ్మకంతో ఉన్న ఎనిమిది సినిమాలు ఆశించిన మేరకు ఆడలేదు. నేను అంగీకరించి చేసిన సినిమా హిట్‌ అవ్వడంలేదంటే అది ముమ్మాటికి నా తప్పే. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. సినిమా సినిమాకు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదంటే వాళ్లు నా నుంచి కొత్తదనంతో కూడిన థలను ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నా. కొత్త తరహా కథల వేటలో ఉన్నా. ఒక వ్యాపారంలో ఎప్పుడూ లాభాలే రావు. నష్టాలు కూడా ఉంటాయి. ఒక క్రికెటర్‌ ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టలేడు. అయితే నేను చెప్పేది ఒకటే సినిమా హిట్‌ కాకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. సినిమా ఫెయిల్‌ కావడం అనేది వంద శాతం నా తప్పే’’ అని అక్షయ్‌ అన్నాడు.

Updated Date - 2023-02-26T16:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising