ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akshay Tritiya 2023: ఈసారి అక్షయ తృతీయ రోజు పెళ్లిళ్లు జరగవ్.. ఏప్రిల్ 22, 2023న పెళ్లి చేసుకోకూడదట.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-04-13T12:02:12+05:30

ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున అలా చేయడానికి వీలు పడదు.

Akshaya Tritiya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటాం. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న రాబోతుంది. శుభ కార్యాలు చేయడానికి నిర్దిష్ట తేదీ అందుబాటులో లేనట్లయితే, ఆ పనులు అక్షయ తృతీయ నాడు మిగతా చాలా శుభకార్యాలతో పాటు వివాహాన్ని కూడా అక్షయ తృతీయ రోజున చేయడం శభాలను తెస్తుందని నమ్ముతారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున అలా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే ఆరోజున మాంగళ్య కారకుడైన గురువు సరైన స్థానంలో లేని కారణంగా వివాహాలు జరిపించకూడదు.

గురుడు: ఈసారి వైశాఖ తృతీయ తిథి 22వ తేదీన వచ్చింది. 22వ సంఖ్యకు గురువు అధిపతి. ఈసారి గురు గ్రహం శుభ లగ్నంలో లేని కారణంగా ఆరోజున వివాహాలు కొందరు జరిపించేందుకు ముందుకు రావడంలేదు. కాకపోతే అదే రోజున వివాహం జరిగితే వివాహానికి సంబంధించిన అడ్డంకులు కలుగుతాయట.

కుజదోషం: అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకోవడం ద్వారా కుజదోషం తొలగిపోతుందని శాస్త్రాలలో చెప్పబడింది. కొందరి జాతకంలో కుజదోషం ఉంటుంది. అలాంటి వధూవరులు ఈ ప్రత్యేక రోజున వివాహం చేసుకోవచ్చు. కుజదోషాన్ని తొలగించవచ్చు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు హానికరమైన గ్రహాల ప్రభావాలను తగ్గించగలదని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం, ఈ రోజున వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండే వరం లభిస్తుందట. ఈ కారణంగానే ముహూర్తాలలో ఈ రోజుకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ముహర్తంతో సంబంధం లేకుండా కూడా శుభకార్యాలను నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి: శమీ మొక్క ఇంట్లో ఉంటే ధనవంతులవుతారు.. దీనితో శివుడికి నైవేద్యం పెడితే బోలెడు శుభాలు కలుగుతాయట.. !

'అక్షయ' అంటే అంతులేని ఆనందం, శాశ్వతమైనది, విజయవంతమైనది, అని అర్థం.

అందుకే ఈ ఆనందం మన ఇళ్ళల్లో ఎల్లప్పుడూ ఉండాలని అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇచ్చే దానధర్మాల వలన దాతకి చాలా ప్రయోజనాలు చేకూరతాయని నమ్ముతారు. ఈ దానాలలో కెల్ల గొప్పదానం కన్యాదానం గొప్పది. అందుకే ఈ రోజున తండ్రి తన కుమార్తెకు కన్యాదానం చేయడం కోసం వివాహం చేస్తారు, తద్వారా ఆమె జీవితం ఆనందంగా ఏలోటూ లేకుండా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. దీనితో పాటు, అక్షయ తృతీయ రోజున వివిధ రకాల ధాన్యాలను కూడా దానం చేస్తారు, ఎందుకంటే ఈ సమయంలో గోధుమ పంటను ఇళ్లకు తీసుకువస్తారు.

జ్యోతిష్యం ఏమి చెబుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలకు శభ సూచికగా భావించే బృహస్పతి తార సరైన స్థానంలో లేని కారణంగా, అక్షయ తృతీయ సందర్భంగా ఎటువంటి శుభ కార్యాలు చేయడంలేదు. ఈ నక్షత్రం ఏప్రిల్ 28న రానన్న కారణంతో 28 తరువాత నుండి శుభకార్యాలు జరగనున్నాయి.

Updated Date - 2023-04-13T12:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising