ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shehzada: అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ ట్రైలర్ ఔట్!

ABN, First Publish Date - 2023-01-12T17:55:20+05:30

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘లవ్ అజ్‌కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ‘భూల్ భూలయ్యా 2’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’, ‘లవ్ అజ్‌కల్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ‘భూల్ భూలయ్యా 2’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోగా మారిపోయాడు. అతడు తాజాగా నటించిన సినిమా ‘షెహజాదా’ (Shehzada). అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) కీ హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా నటించింది. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ దాదాపుగా 3నిమిషాల పాటు కొనసాగింది. యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ ఒపెన్ అయింది. కుటుంబం విషయానికి వస్తే నో డిస్కషన్ ఓన్లీ యాక్షన్ అనే డైలాగ్స్ అలరించాయి. ట్రైలర్ లో రాజమౌళి పేరును కూడా వాడుకున్నారు. కార్తిక్ ఆర్యన్ అద్భుతమైన లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కార్తిక్ తల్లిగా మనీషా కొయిరాలా కనిపించింది. ఈ చిత్రంలో రోనిత్ రాయ్, పరేశ్ రావల్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-12T18:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising