ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమి మీద కన్నా విమానంలో మందు కొడితే వేగంగా కిక్కు ఎక్కుతుందా? దీనిలో నిజమెంత? నిపుణులు చెబుతున్నదిదే..

ABN, First Publish Date - 2023-05-03T08:00:53+05:30

మద్యం తాగిన వ్యక్తి మత్తులోకి వెళ్లడం మామూలే. అయితే విమానంలోపల ఆల్కహాల్(Alcohol) తాగితే భూమి మీద తాగిన దానికన్నా వేగంగా మత్తు ఎక్కుతుందంటారు. దీనిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం తాగిన వ్యక్తి మత్తులోకి వెళ్లడం మామూలే. అయితే విమానంలోపల ఆల్కహాల్(Alcohol) తాగితే భూమి మీద తాగిన దానికన్నా వేగంగా మత్తు ఎక్కుతుందంటారు. దీనిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం పూర్తిగా నిజమని నిపుణులు(Experts) చెబుతున్నారు. దీనివెనుక ఒక సైన్స్ సిద్ధాంతం ఉందంటున్నారు.

డైలీ మెయిల్‌(Daily Mail)లోని ఒక నివేదిక ప్రకారం ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా ఫ్లైట్ అటెండెంట్ బ్రాడీ కాప్రాన్ సమాధానమిచ్చారు. దీనికి సమాధానం తెలుసుకునే ముందు విమానానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. రోడ్డుపై కదులుతున్న కారు(car) తలుపును అందులోనివారు తెరవగలుగుతారు. ఇదేవిధంగా విమానం ఎరుగుతున్నప్పుడు కూడా దానిలోని తలుపును తెరవగలమని చాలామంది అనుకుంటారు. అయితే దీనిలో అస్సలు నిజం లేదు. ఎగురుతున్న విమానం(plane)లోని తలుపును ఎవరూ తెరవలేరు. దీని వెనుక కారణం ఏమిటంటే విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు దానిలోని తలుపులపై ​​24 వేల పౌండ్ల ఒత్తిడి ఉంటుంది.

ఇటువంటి పరిస్థితిలో 3.6 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవైన ఇనుప తలుపు తెరవడానికి అనేక ఏనుగుల బలం(strength of elephants) అవసరం అవుతుంది. అంటే సినిమా స్టైల్‌లో చెప్పాలంటే బాహుబలి(Bahubali) కంటే పవర్‌ఫుల్‌గా ఉండాలి. ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో విమానం లోపల ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురవుతారు. దీంతో వారికి టేకాఫ్, ల్యాండింగ్(Landing) సమయంలో విండో షేడ్స్ పైకి ఎత్తాలనే ఆదేశాలు అందుతాయి.

దీంతో బయటి సహజ కాంతిని, అందమైన దృశ్యాలను చూడటం ద్వారా వారు భయాన్ని అధిగమించగలుగుతారు. విమానంలో మద్యం సేవించడం ఎవరికైనా ప్రమాదకరంగా మారుతుంది. దీనివెనుకనున్న కారణం ఏమిటంటే.. ఆల్కహాల్‌ను చాలా ఎత్తులో అంటే.. విమానంలో తాగితే దానిని తట్టుకోగల శక్తి(Endurance power) మనిషికి ఉండదు. ఫలితంగా మద్యం సేవించిన వ్యక్తి తనపై నియంత్రణను కోల్పోతాడు. ఎత్తయిన ప్రదేశంలో గాలిలో ఆక్సిజన్(Oxygen) పరిమాణం తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మద్యం సేవించినప్పుడు వారి శరీరంపై మద్యం ప్రభావం(Effect of alcohol) చాలా అధికంగా ఉంటుంది.

Updated Date - 2023-05-03T08:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising