Alia Bhatt: ప్రైవేట్ ఫొటోలు లీక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్..
ABN, First Publish Date - 2023-02-22T15:18:25+05:30
సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌పై అందరికి ఆసక్తి ఉంటుంది. అభిమానులయితే నటీ, నటులు ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా మనుషులనే సంగతిని కూడా మరచిపోతుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు.
సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌పై అందరికి ఆసక్తి ఉంటుంది. అభిమానులయితే నటీ, నటులు ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా మనుషులనే సంగతిని కూడా మరచిపోతుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) ప్రైవసీకి భంగం కలిగింది. ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తులు కెమెరాలతో ఆమె ఇంటిపై దృష్టి సారించారు. ఫొటోలు తీశారు. ఫలితంగా ఆలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఆలియా భట్ ఫొటోగ్రాఫర్స్ తీసిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘మీరు నన్ను ఆటపట్టిస్తున్నారా..? నేను ఇంటిలో మాములుగా నా మధ్యాహ్నన్ని గడుపుతున్నాను. లివింగ్ రూంలో కూర్చొని ఉండగా ఎవరో నన్ను చూస్తున్నారనిపించింది. నేను బయటికి చూడగా పక్కింటి బిల్డింగ్ టెర్రస్ నుంచి ఇద్దరు వ్యక్తులు కెమెరా పట్టుకుని ఫొటోలు తీస్తున్నారు. ఈ విధ్యమైన చర్యలకు ఏ గ్రహంలో ఓకే చెబుతారు..? దేనికైనా ఓ హద్దు ఉంటుంది దానిని మీరకూడదు. కానీ, ఈ రోజు అన్ని హద్దులను క్రాస్ చేశారు’’ అని ఆలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు ఆలియా పెట్టిన పోస్ట్‌కు తమ మద్దతును తెలుపుతున్నారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) వారు ఈ విధంగా చేయడం మొదటిసారి కాదని చెప్పింది. ‘‘రెండేళ్ల క్రితం నేను, విరాట్ ఈ విధమైన కారణంతోనే వారిని నిందించాం. వారు బాధ్యతగా ప్రవర్తించి, ప్రైవసీని గౌరవిస్తారనుకున్నాం. అయినప్పటికి సిగ్గు లేకుండా అదే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేయకూడదని పలు మార్లు అభ్యర్థించినప్పటికీ మా కుమార్తె ఫొటోలను అదే పనిగా పోస్ట్ చేస్తున్నారు’’ అని అనుష్క శర్మ పేర్కొంది. సుస్మితా సేన్ (Sushmita Sen), రియా చక్రవర్తి, జాన్వీ కపూర్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ తదితరులు ఈ ఘటనను ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.
Updated Date - 2023-02-22T15:18:27+05:30 IST