ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shehzada Twitter review: ‘అల వైకుంఠపురములో’ హిందీ రిమేక్ మెప్పించిందా? లేదా?

ABN, First Publish Date - 2023-02-17T12:36:19+05:30

బాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే సత్తా ఉన్న అతికొద్దిమంది నటుల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కచ్చితంగా ఉంటాడు.

Shehzada
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే సత్తా ఉన్న అతికొద్దిమంది నటుల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) కచ్చితంగా ఉంటాడు. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా ఎదిగిన ఈ యువ నటుడు ఈ మధ్య వరుస హిట్లు కొడుతూ జోరు మీద ఉన్నాడు. గతేడాది ‘భూల్ భూలయ్యా 2’తో థియేటర్స్‌లో సూపర్ హిట్ కొట్టిన ఈ నటుడు.. ఇటీవలే ‘ఫ్రెడ్ఢీ’ అనే చిత్రంలో ఓటీటీలోనూ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘షాహ్‌జాదా’ (Shehzada). రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతిసనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్ర నిర్మాతల్లో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒకరు.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’కి ఇది హిందీ రిమేక్. దీంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌ (Allu Arjun) ఫెర్పామెన్స్‌ని కార్తీక్‌కి మ్యాచ్ చేశాడా లేదా అని చూద్దామనే.. ఉత్సుకత కూడా సినీ లవర్స్‌లో ఉంది. ఇన్ని అంచనాల మధ్య ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 17) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల అయ్యింది. ఇప్పటికే పలు చోట్లు ఈ చిత్ర ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో రివ్యూలు షేర్ చేస్తున్నారు. (Shehzada Twitter review)

ఇది కూడా చదవండి: SIR Twitter Review: ధనుష్ తెలుగు డెబ్యూ మూవీ హిట్టా? ఫట్టా?

‘కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. రొమాన్స్, ఎమోషనల్‌గా చాలా బాగా చేశాడు. పైసా వసూల్ చిత్రం. బ్లాక్ బస్టర్ లోడింగ్’.. ‘ఇప్పటికే హిట్ అయినా చిత్రంలో నటించడం చాలా కష్టం. కార్తీక్ ఆర్యన్ బాగా చేశాడు. కృతి కూడా అందంగా కనిపించింది. వారాంతంలో చూడడానికి మంచి చిత్రం’ అంటూ కొందరూ రాసుకొచ్చారు. ఈ సినిమా గురించి మరికొందరూ ఏమంటున్నారో చూద్దాం..

Updated Date - 2023-02-17T12:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising