ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: మీ ఓపికకు సలాం సామీ.. ఆ యువతి చేసిన ఒక్క మిస్టేక్‌తో.. 20 టన్నుల చెత్తనంతా వెతికి మరీ..!

ABN, First Publish Date - 2023-11-30T16:31:56+05:30

ఏదైనా వస్తువు పోతే దొరకడం అంత సులభం కాదు. అది కూడా రోడ్డు పక్కన డస్ట్‌బిన్‌లో పడేసిన వస్తువును కనిపెట్టడం మహా కష్టం. అలాంటిది అమెరికాలోని పారిశుధ్య కార్మికులు ఏకంగా 20 టన్నుల చెత్తను వెతికి మరీ ఆ యువతి పడేసుకున్న వస్తువును కనిపెట్టారు.

ఏదైనా వస్తువు పోతే దొరకడం అంత సులభం కాదు. అది కూడా రోడ్డు పక్కన డస్ట్‌బిన్‌లో పడేసిన వస్తువును కనిపెట్టడం మహా కష్టం. అలాంటిది అమెరికాలోని పారిశుధ్య కార్మికులు ఏకంగా 20 టన్నుల చెత్తను వెతికి మరీ ఆ యువతి పడేసుకున్న వస్తువును కనిపెట్టారు. ఓ గిప్టుగా పార్శిల్ చేసి మరీ ఆ యువతికి అందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంలోకి వెళ్తే..

అమెరికాకు చెందిన ఓ యువతి పొరపాటున తన పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. చేతిలో ఉన్న కవర్‌‌ను విసిరేస్తుండగా పొరపాటున ఆ ఉంగరం కూడా డస్ట్ బిన్‌లో పడిపోయింది. దీన్ని అప్పుడే ఆ యువతి గమనించలేదు. కొద్ది గంటల తర్వాత చేతికి ఉంగరం లేదన్న సంగతిని గుర్తించింది. ఎక్కడ పడేసిందో.. అసలు ఏమయిందో కూడా ఆమెకు గుర్తులేదు. దీంతో కన్నీటిపర్యంతమయింది. ‘నా పెళ్లి ఉంగరం పోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. ఇంట్లో అయితే అస్సలు లేదు. కాసేపటి క్రితమే బయటకు వెళ్లి వచ్చాను. అప్పుడేమైనా పోయిందో తెలియదు. ఎవరికైనా దొరికితే ఇవ్వండి ప్లీజ్’.. అంటూ ఏడుస్తూ ఓ వీడియోను చేసింది.

ఆమె బాధను చూసి న్యూయార్క్‌లోని జనరల్ సర్వీసెస్ అధికారి డెన్నీస్ సెనిబల్డీ వెంటనే రియాక్టయ్యారు. వెంటనే ఆమె ఇంటికి అయిదు కిలోమీటర్ల పరిధిలోని పారిశుధ్య కార్మికులను అలెర్ట్ చేశారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ చేసి.. ఎక్కడెక్కడకు వెళ్లారన్న వివరాలను ఆరా తీశారు. ఆమె ప్రయాణించిన కారు నెంబర్, ఆమె వెళ్లిన హోటల్స్ వివరాలను సేకరించారు. దాన్ని బట్టి సీసీ కెమెరాలను చెక్ చేశారు. ఆమె కారు ఎక్కడెక్కడ ఆగిందన్నది గుర్తించి ఆయా ప్రాంతాల్లో డస్ట్ బిన్‌లను వెతికించారు. దాదాపుగా 20 టన్నుల చెత్తను ఓపిగ్గా వెతికిన పారిశుధ్య కార్మికులకు చివరకు ఆ ఉంగరం దొరికేసింది.

దీంతో ఆ ఉంగరాన్ని శుభ్రంగా కడిగి, గిఫ్టు ప్యాక్‌లో పెట్టి మరీ ఆ యువతికి డెన్నీస్ అందించారు. ఉంగరం మళ్లీ దొరుకుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆ యువతి సంతోషంతో చిందులేసింది. ఈ ఘటనను తాను జీవితంలో మర్చిపోలేననంటూనే.. ఆ అధికారికి, పారిశుధ్య కార్మికులకు పదే పదే ధన్యవాదాలు తెలియజేసింది. ఈ విషయానికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ సాధారణ యువతి ఉంగరం పోతే 20 టన్నుల చెత్తను వెతికించి మరీ ఇచ్చేవాళ్లు ఈ రోజుల్లో ఉన్నారా అంటూ ఆ అధికారిపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల ఓపికకు కూడా సలాం చెబుతున్నారు.

Updated Date - 2023-11-30T16:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising