Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్లో బిగ్ బీకి గాయాలు.. నాలుగు రోజుల ఆలస్యంగా..
ABN, First Publish Date - 2023-03-06T10:30:22+05:30
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రభాస్ (Prabhas) కాంబోలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’ (Project K)లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ తరుణంలో నాలుగు రోజుల క్రితం ఆయనకి ప్రమాదం జరిగింది.
‘ప్రాజెక్ట్ కే’ కి సంబంధించి ఓ యాక్షన్ సంబంధించి షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బిగ్‌బీ పక్కటెముకలకి గాయాలయ్యాయి. మూవీ టీం వెంటనే గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్‌కి తరలించింది. చికిత్స అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంట్లోనే అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. చాలా పెయిన్ ఉందంటూ బాధని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’
Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు
Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్
Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్
Updated Date - 2023-03-06T10:54:47+05:30 IST