Shocking Incident: ఒంటరిగా గదిలో ఉంచినా.. ఎలా గర్భం దాల్చింది..? తండ్రెవరో తేల్చేందుకు చేసిన డీఎన్‌ఏ టెస్టుల్లో మైండ్‌బ్లాకయ్యే ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-02-14T19:07:34+05:30
జపాన్‌లో ఓ జంతుప్రదర్శన శాలలో (Japan Zoo) తన బోనులో ఒంటరిగానే నివసిస్తున్న ఓ చిన్న కోతి (Gibbon Pregnancy) తల్లి కావడం వెనక ఉన్న రహస్యం వీడింది. దాదాపు రెండేళ్లు పరిశోధన సాగించిన జూ నిర్వాహకులు ఎట్టకేలకు మిస్టరీని బయటపెట్టారు.
జపాన్‌లో ఓ జంతుప్రదర్శన శాలలో (Japan Zoo) తన బోనులో ఒంటరిగానే నివసిస్తున్న ఓ చిన్న కోతి (Gibbon Pregnancy) తల్లి కావడం వెనక ఉన్న రహస్యం వీడింది. దాదాపు రెండేళ్లు పరిశోధన సాగించిన జూ నిర్వాహకులు ఎట్టకేలకు మిస్టరీని బయటపెట్టారు. నాగసాకిలోని కుజుకుషిమా జూ, బొటానికల్ గార్డెన్‌లో ఉన్న 12 ఏళ్ల మోమో (కోతి పేరు) 2021 ఫిబ్రవరిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జూ కీపర్లు షాకయ్యారు. ఎందుకంటే ఎప్పట్నుంచో మోమో తన బోనులో ఒంటరిగానే నివసిస్తోంది.
మగ సావాసం లేనప్పటికీ మోమో తల్లి కావడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేశారు. చివరకు DNA Test ద్వారా అసలు విషయం కనుగొన్నారు. మోమో సమీపంలో ఉన్న బోనులో ఉండే 34 ఏళ్ల ఇటా (మగ కోతి) వల్లే మోమో గర్భవతి అయినట్టు తేల్చారు. Momo, Ito బోనుల మధ్య కేవలం 0.3 అంగుళాలు వ్యాసంతో ఉన్న ఖాళీ స్థలాన్ని జూ కీపర్లు గమనించారు. ఈ చిన్న రంధ్రం నుంచి మోమో బోనులోకి ఇటా ప్రవేశించి జత కట్టిందని కనుగొన్నారు. రెండేళ్ల క్రితం జన్మించిన పిల్ల కోతికి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం అది 2 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.
Updated Date - 2023-02-14T19:07:36+05:30 IST