తవ్వకాల్లో 15 అడుగుల లోతున విష్ణుమూర్తి విగ్రహం... చూసేందుకు జనం పరుగులు!
ABN, First Publish Date - 2023-01-17T12:21:13+05:30
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో రైల్వే లైన్ కోసం జరుపుతున్న మట్టి తవ్వకాల్లో 4 అడుగుల ఎత్తయిన విష్ణువు విగ్రహం బయట పడింది. ఈ అష్టధాతు విగ్రహం చాలా పురాతనమైనది అని భావిస్తున్నారు.
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో రైల్వే లైన్ కోసం జరుపుతున్న మట్టి తవ్వకాల్లో 4 అడుగుల ఎత్తయిన విష్ణువు విగ్రహం బయట పడింది. ఈ అష్టధాతు విగ్రహం చాలా పురాతనమైనది అని భావిస్తున్నారు. పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖకు విచారణ నిమిత్తం తరలించారు. బరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌పూర్ గ్రామ సమీపంలో రైలు మార్గం వెంబడి జేసీబీతో మట్టిని తవ్వుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ నేపధ్యంలో భూమిలోపల 15 అడుగుల లోతున పురాతన విష్ణుమూర్తి విగ్రహం లభ్యమైంది.
విగ్రహం గురించిన సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి పూజలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 4 అడుగుల ఈ విగ్రహం నలుపు రంగులో ఉంది.
చూడగానే ఆ విగ్రహం విష్ణుమూర్తిది అని తెలుస్తోంది. విగ్రహంలోని కుడి చేయి విరిగిపోయింది. బరౌలి స్టేషన్ ఇన్‌చార్జి అశ్వనీ కుమార్ తివారీ మాట్లాడుతూ ఈ విగ్రహం చాలా విలువైనదని, అష్టధాతువులతో తయారు చేయబడినదని, అయితే ప్రస్తుతానికి పెద్దగా వివరాలేమీ చెప్పలేమని అన్నారు. స్థానికులు మొదట ఈ విగ్రహాన్ని చూశారు. ఆ తర్వాత పోలీసులకు ఈ సమాచారం అందించారు. విగ్రహం చాలా పురాతనమైనదిగా కనిపిస్తున్నది. ప్రస్తుతం పోలీసులు విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. విగ్రహాన్ని విచారణ నిమిత్తం పురావస్తు శాఖకు పంపుతున్నట్లు స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. విచారణ తర్వాత మాత్రమే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు.
Updated Date - 2023-01-17T12:21:14+05:30 IST