Andean Condor : ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షి ఎన్నేళ్ళు బ్రతుకుతుందో తెలుసా..!
ABN, First Publish Date - 2023-01-07T12:44:09+05:30
దాదాపు 16000 వేల ఎత్తులో రాతి కొండల అచుల మీద గూడు కడతాయి.
ఆండియన్ కాండోర్ అనేది న్యూ వరల్డ్ రాబందుల కుటుంబానికి చెందిన కాథర్టిడేలోని ఒక దక్షిణ అమెరికా పక్షి. ఇది వల్టర్ జాతికి చెందినది. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలోని అండీస్ పర్వతాలలో అలాగే పసిఫిక్ తీరాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆండియన్ కాండోర్ బరువు, రెక్కలును కలిపి కొలిస్తే ఈ పక్షి ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షి. గరిష్టంగా 3.3 మీటర్ల రెక్కలతో దాదాపు 15 కిలోల బరువు కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద వేటాడే పక్షిగా దీనిని పరిగణించబడుతుంది.
ఆండియన్ ఒక పెద్ద నల్ల రాబందు, దీని మెడ ఆధారంగా చుట్టూ తెల్లటి ఈకలతో మామూలు రాబందులకన్నా భిన్నంగా ఉంటుంది. ముఖం కాస్త కోడి ఆకారంలో కనిపించినా.. దీనికి మెడ భాగం అంతా ఈకలు లేకుండా చర్మం మందమైన ఎరుపు రంగులో ఉంటుంది. వీటిలో మగవాటికి తలమీద కుచ్చులా కిరీటం ఉంటుంది.
ఇవి చనిపోయిన జంతువులను తింటాయి. ఇవి జింక, ఇతర జంతువుల మాంసాన్ని తినడానికి ఇష్టపడుతుంది. ఆరుసంవత్సరాల వయస్సులో లైంగిక పరిపక్వతకు చేరుతుంది. దాదాపు 16000 వేల ఎత్తులో రాతి కొండల అచుల మీద గూడు కడతాయి. ఒకటి రెండు గుడ్లను మాత్రమే పెడతాయి. ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించే పక్షులలో ఇవీ ఒకటి. వీటి జీవితకాలం దాదాపు 70 సంవత్సరాలు.
ఆండియన్ కాండోర్ బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరూలకు జాతీయ చిహ్నం. ఆండియన్ ప్రాంతాల జానపద కథలు, పురాణాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆండియన్ కాండోర్ IUCN చేత హాని కలిగించేదిగా చేర్చబడింది. ఇది అడవులు నరికివేయడం, ఆవాసాల నష్టం కారణంగా, వేటగాళ్లచే చంపబడి అంతరించే జీవజాతుల్లో ఇవి కూడా చేరాయి.
Updated Date - 2023-01-07T12:53:20+05:30 IST