Animals care In Jharkhand: 100 ఏళ్ల క్రితం ఎద్దు మృతి చెందిందని... నేటికీ ఆ 20 గ్రామాలవారు చేస్తున్న పనికి అందరూ ఫిదా...!
ABN, First Publish Date - 2023-03-23T10:17:36+05:30
Animals care In Jharkhand: ఆ రాష్ట్రంలోని 20కి పైగా గ్రామాల్లో పశువులకు ఒకరోజు సెలవు ఇస్తారు. ఆదివారాల్లో(Sundays) పశువులకు పూర్తి విశ్రాంతి ఇస్తారు.
Animals care In Jharkhand: ఆ రాష్ట్రంలోని 20కి పైగా గ్రామాల్లో పశువులకు ఒకరోజు సెలవు ఇస్తారు. ఆదివారాల్లో(Sundays) పశువులకు పూర్తి విశ్రాంతి ఇస్తారు. జార్ఖండ్‌లోని లోథర్ జిల్లాలోని 20 గ్రామాల్లో(villages) ఈ ఆచారం కొనసాగుతోంది. ఆ రోజున గ్రామంలోని ఎవరూ ఆవులు, గేదెల పాలు పితకరు. పైగా ఆరోజు పశువుల పెంపకందారులందరూ పశువులకు ఎంతో సేవ(Service) చేస్తారు. వాటికి ఆరోజు మంచి దాణా(Feeding) అందిస్తారు. ఆదివారాల్లో పశువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పనుల కోసం పొలానికి(farm) తీసుకెళ్లరు.
తమ పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు(Locals) చెబుతున్నారు. 100 సంవత్సరాలుగా దీనిని అనుసరిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇది ఎంతో మంచి విధానమని పశువైద్యులు(Veterinarians) కూడా చెబుతున్నారు. జంతువులకు కూడా విశ్రాంతి(Rest) అవసరమని వారు సూచిస్తున్నారు. సుమారు 100 ఏళ్ల క్రితం పొలం దున్నుతుండగా ఒక ఎద్దు(bull) చనిపోయిందని, ఆ నాటి నుంచి పశువులకు సెలవు(Holiday) ఇవ్వడం ఆచారంగా మారిందన్నారు.
Updated Date - 2023-03-23T10:38:47+05:30 IST