Hollywood actor: ‘RRR చాలాసార్లు చూశాను.. ఇంకా ఎమైనా ఉంటే చెప్పండి’

ABN, First Publish Date - 2023-02-16T15:31:50+05:30

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Hollywood actor: ‘RRR చాలాసార్లు చూశాను.. ఇంకా ఎమైనా ఉంటే చెప్పండి’
Ant man
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు నటించిన ఈ చిత్రం విడుదలైన చాలా తక్కువ సమయంలో రూ.1200 కోట్ల వసూళ్లను సాధించింది. అనంతరం ఓటీటీలో విడుదలైన తర్వాత సినిమాని చూసిన ఎంతోమంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో హాలీవుడ్ నటుడు ఈ చిత్రం అంటే తనకి చాలా ఇష్టమని తెలియజేశాడు.

‘అవెంజర్స్’.. ఈ సిరీస్ సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన చాలా సినిమాలు, వెబ్‌‌సిరీస్‌లు ప్రేక్షకుల మెప్పుపొందాయి. ఈ సిరీస్‌లో తాజాగా మరో సినిమాగా ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్యాంటమేనియా’ (Ant-Man and The Wasp: Quantumania) ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత దేశంలోనూ ఈ సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలో విలన్ అయిన ‘కాంగ్’ పాత్ర పోషించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.

ఓ ఇంటర్వ్యూలో జోనాథన్ మాట్లాడుతూ.. ‘‘నేను తరుచుగా భారతీయ చిత్రాలను చూస్తుంటాను. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ని కూడా చూశాను. ఒక్కసారి కాదు. చాలాసార్లు చూశాను. ఆ సినిమా మూడు గంటలు ఉన్నప్పటికీ నాకు బాగా నచ్చింది. ఇద్దరూ నటుల చాలా బాగా నటించారు. వారి నటనని చాలా ఎంజాయ్ చేశాను’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ‘చూడదగ్గ భారతీయ సినిమాలు ఉంటే నాకు చెప్పొచ్చు’ అంటూ ఇండియన్ సినిమాలపై తనకి ఉన్న ప్రేమని జోనాథన్ తెలియజేశాడు.

ఇది కూడా చదవండి: Kate Winslet: భర్త ముందే మరొకరితో శృంగార సన్నివేశాలు.. ఎలా ఫీల్ అయ్యిందో చెప్పిన టైటానిక్ బ్యూటీ

Updated Date - 2023-02-16T15:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising