ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచిత్ర రికార్డు నెలకొల్పిన విశ్రాంత ఉపాధ్యాయుడు... ‘ఇది ఎవరికి కావాలి’ అని ఒకరంటే, ‘బద్దలు కొట్టడమే లక్షం’ అని మరొకరు..

ABN, First Publish Date - 2023-04-02T11:51:24+05:30

ప్రపంచంలో విచిత్రమైన అలవాట్లు, అభిరుచులు(hobbies) కలిగినవారు చాలా మంది ఉంటారు. ఈ కోవకు చెందినవారే ఈ వ్యక్తి. ఆంటోనీ విక్టర్ తమిళనాడు(Tamil Nadu)లోని మధురైలో నివసిస్తున్న రిటార్డెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలో విచిత్రమైన అలవాట్లు, అభిరుచులు(hobbies) కలిగినవారు చాలా మంది ఉంటారు. ఈ కోవకు చెందినవారే ఈ వ్యక్తి. ఆంటోనీ విక్టర్ తమిళనాడు(Tamil Nadu)లోని మధురైలో నివసిస్తున్న రిటార్డెడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అతని చెవుల బయటి వెంట్రుకలు(hair) చాలా పొడవుగా ఉంటాయి. సుమారు 18.1 సెం.మీ అంటే 7.12 అంగుళాల పొడవు కలిగివున్నాయి. ఈ చెవి వెంట్రుకలు ఇప్పుడు అతనికి గుర్తింపు(Identity)గా మారాయి.

పాఠశాల సిబ్బంది, అతని విద్యార్థులు అతన్ని 'వెంట్రుకల చెవుల ఉపాధ్యాయుడు' అని ముద్దుగా పిలుచుకుంటారు. విక్టర్(Victor) ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది అతని గురించి చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఒక యూజర్ దీనిపై స్పందిస్తూ 'అలాంటి రికార్డు ఎవరికి కావాలి' అని వ్యాఖ్యానించగా, మరొక యూజర్ ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడమే నా జీవిత లక్ష్యం అని రాశారు.

చెవి వెంట్రుకలకు(ear hair) సంబంధించిన రికార్డు(record) భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు. ఈ రికార్డు 2003 సంవత్సరంలో రాధాకాంత్ బాజ్‌పాయ్(Radhakant Bajpai) సాధించాడు. రాధాకాంత్ బాజ్‌పాయ్ చెవి వెంట్రుకల పొడవు 13.2 సెం.మీ. రాధాకాంత్ బాజ్‌పాయ్ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) నివాసి. తన చెవి వెంట్రుకలను పెంచుకోవడానికి తన భార్య అనుమతి ఇచ్చిందని రాధాకాంత్ బాజ్‌పాయ్ తెలిపారు.

Updated Date - 2023-04-02T12:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising