ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Non Drying Paint: ఆ పెయింట్ ఇంటికి కళను ఇవ్వడమే కాదు... లోనికి చొరబడాలనుకునే దొంగలను గుమ్మంలోనే కింద పడేస్తుంది.. అదెలాగో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-25T09:36:20+05:30

Non Drying Paint: ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పెయింట్‌ గురించి తెలుసుకుందాం. ఇది మీ ఇంట్లోకి దొంగల చొరబాటును అడ్డుకుంటుంది. వినడానికే ఆశ్చర్యంగా అనిపించే ఈ పెయింట్(Paint) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Non Drying Paint: ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పెయింట్‌ గురించి తెలుసుకుందాం. ఇది మీ ఇంట్లోకి దొంగల చొరబాటును అడ్డుకుంటుంది. వినడానికే ఆశ్చర్యంగా అనిపించే ఈ పెయింట్(Paint) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెయింట్‌ను యాంటీ క్లైంబింగ్ పెయింట్(Anti-climbing paint) అంటారు.

ఈ పెయింట్‌తో మీ ఇంటి సరిహద్దు గోడకు(boundary wall) పెయింట్ చేస్తే ఆ గోడను దాటి ఇంట్లోకి ఎవరూ చొరబడలేరు. సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడేటప్పుడు వారు గోడలను ఎక్కి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ తరహా పెయింట్... దొంగలను లోపలికి రాకుండా చేస్తుంది. ఈ పెయింట్‌కు ఉన్న మరో ప్రత్యేకత(Uniqueness) ఏమిటంటే పెయింట్ వేసిన గోడలు మూడేళ్ల పాటు తడిగానే ఉంటాయి. అయితే ఈ పెయింట్‌ను గోడలపై మూడు మిల్లీమీటర్ల మందంలో వేయాల్సివుంటుంది.

ఈ గోడ దీర్ఘకాలం పాటు తడిగా(wet for a long time) ఉండటం వలన దీనిని ఏ దొంగ అయినా ఎక్కడానికి ప్రయత్నిస్తే అతని చేతులు, కాళ్ళు జారిపోయి కింద పడతాడు. అది వేసవి కాలం(summer season) అయినా లేదా శీతాకాలం అయినా ఈ పెయింట్ పొర నిత్యం తడిగానే ఉంటుంది. చూసేందుకు ఈ పెయింట్ సాధారణ పెయింట్ మాదిరిగానే కనిపిస్తుంది. దీంతో దొంగలు కూడా ఈ పెయింటింగ్ రహస్యాన్ని(secret of painting) కనిపెట్టలేరు.

కాగా ఈ పెయింట్‌ను కామ్రెక్స్ పెయింట్స్(Comrex Paints) తయారు చేసింది. ఈ పెయింట్ పలు పెయింటింగ్ దుకాణాలలో లభ్యమవుతుంది. కాగా ఈ పెయింట్ చర్మానికి అంటుకుంటే దానిని తొలగించడం చాలా కష్టం. అయితే ఈ పెయింట్‌ను 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో మాత్రమే వినియోగించాలని, దీని వల్ల సామాన్యులకు(common people) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పెయింట్ తయారీదారులు(Paint manufacturers) సూచిస్తుంటారు.

Updated Date - 2023-04-25T09:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising