April Fools Day: ఏప్రిల్ 1 కదా అని ఎదుటివాళ్లను బకరా చేసి సంబరపడేవాళ్లలో 100కు 99 శాతం మందికి ఈ విషయమే తెలియదు..!
ABN, First Publish Date - 2023-04-01T10:52:40+05:30
నకిలీ తోకను వెనుక ఉన్న మీ స్నేహితుడికి రహస్యంగా అటాచ్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో చిలిపిగా, జోకులతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటాం. ప్రాక్టికల్ జోకులను వేస్తూ, హూపీ కుషన్ బెలూన్‌ను కుర్చీపై ఉంచడం వంటి చిన్న చిన్న వాటి నుండి చిలిపిగా ఉండే ఈ సరదా వేడుక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓ చిలిపి రోజు. చిన్నతనంలో పెద్దవాళ్ళను కూడా ఆటపట్టిస్తూ సరదాగా గడిచేది ఈరోజు. ఇప్పటికీ ఫూల్స్ డే జరుపుకుంటున్నారు కానీ కాస్త హుందాగా జరుగుతుంది. అసలు ఈరోజున ఇంకే చేయచ్చు అనేది తెలుసుకుందాం.
ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు?
ఏప్రిల్ 1న చాలామంది మనల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చిన్న సాకుల చెప్తూ ఫూల్స్ చేస్తుంటారు. చిన్న సాకులను నమ్మిన వ్యక్తిన ఏప్రిల్ ఫూల్ అంటూ ఎగతాలి చేస్తారు. అయితే, ఈ ఫూల్ డేకు వందేళ్ల చరిత్ర ఉంది. దీనిని మొదటి సారి 1686లో యూనెటెడ్ కింగ్డమ్ లోని జాన్ ఆబెరీ ప్రారంభించాడు. ఆయన 1686, ఏప్రిల్ 1న లండన్ క్లాక్ టవర్ దగ్గర సింహం చనిపోయి ఉందని కొన్ని పుకార్లు చేశాడు.
అది నమ్మిన జనాలు సింహాన్ని చూడటానికి క్లాక్ టవర్ దగ్గరకు క్యూ కట్టారు. అక్కడికి వెళ్లి చూసినవాళ్లంతా అవాక్కయ్యారు. సింహం లేదనే నిజాన్ని తెలుసుకొని ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు అసలు కథ బయటికి వచ్చింది. జాన్ ఆబెరీనే పుకారు లేపాడని, అందరినీ ఫూల్ చేశాడని వార్తా పత్రికల్లో వచ్చింది. అది నిజం అని నమ్మిన వాళ్లంతా ఫూల్ అయ్యారు.
ఇది కూడా చదవండి: చిన్నమార్పులే కదా అనుకోకండి.. ఈ 15 వాస్తు చిట్కాలు వైవాహిక జీవితంలో ఫ్రీగా సంతోషాన్ని తెచ్చిపెడతాయట..
పూల్స్ అయ్యి కూడా...
1582లో ఫ్రాన్స్ దేశ ప్రజలు.. జూలియన్ క్యాలెండర్‌కు ఎండ్ చెబుతూ.. గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. పోప్ గ్రెగొరీ 9 ఈ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రారంభించాడు. ఈ క్యాలెండర్‌లో నూతన సంవత్సరం జనవరి నుండి ప్రారంభమవుతుంది. దీనినే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. అయితే, అంతకు ముందు ఫ్రాన్స్ ప్రజలు వాడిన జూలియన్ క్యాలెండర్‌లో కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 న మొదలవుతుంది. అయితే, పోప్ చార్లెస్ 9 ప్రవేశ పెట్టిన గ్రెగోరియన్ క్యాలెండర్‌ను గుర్తించని కొంతమంది ప్రజలు.. చాలాకాలం ఏప్రిల్ 1ని కొత్త సంవత్సరంగా జరుపుకున్నారు. దాంతో మిగిలిన ప్రజలు ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకున్న వాళ్లను ఫూల్స్‌గా పిలవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి ఏప్రిల్ 1 ఫూల్స్ డే గా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రాముఖ్యత
ఏప్రిల్ ఫూల్స్ డే అంటే చిలిపి, జోకులు మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో సానుకూలత, ఆనందాన్ని నింపడానికి జరుపుకుంటారు. తేలికైన జోక్ వల్ల ప్రజల ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. కలిసి ఉండటానికి , సరదాగా సమయాన్ని గడపడానికి స్నేహితులను ఒకచోట చేర్చుకోవడానికి ఈ రోజు ఒక ఆనందకరమైన సందర్భం.
చిలిపి ఆలోచనలు
1. బబుల్ ర్యాప్ పాప్: కార్పెట్ కింద బబుల్ ర్యాప్ ఉంచండి. ఎవరైనా దాని మీదుగా నడిచి ఆశ్చర్యంతో దూకే వరకు వేచి చూడండి.
2. టూత్‌పేస్ట్: టూత్‌పేస్ట్‌ను విప్డ్ క్రీమ్ క్రీమీ లేదా వనిల్లా ఫ్రాస్టింగ్‌తో కలిపి, ఏప్రిల్ ఫూల్స్ డే నాడు ఎవరైనా ఆశ్చర్యాన్ని అనుభవించే వరకు వేచి ఉండండి.
3. నకిలీ తోక : నకిలీ తోకను., వెనుక ఉన్న మీ స్నేహితుడికి రహస్యంగా అటాచ్ చేయండి.
4. నకిలీ సబ్బు: పిండితో నకిలీ సబ్బును తయారు చేసి పెయింట్ చేయండి ఈ నకిలీ సబ్బును వాడిన వాళ్ళ చేతుల్లో కరిగిపోతుంది. ఎంత ప్రయత్నించినా నురుగు లేకుండా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముఖాల్లోని ఆశ్చర్యాన్ని పట్టుకోండి.
Updated Date - 2023-04-01T10:52:40+05:30 IST