ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Apsara Pencil: ఏం వాడకం సామీ.. అప్సర పెన్సిల్‌ను ప్రేమయాణానికి ఎలా వాడేశారో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-10-17T15:01:23+05:30

యుక్త వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్లు చేసే చిలిపి పనులకు హద్దూ పద్దూ ఉండదు. నచ్చిన అమ్మాయి కనబడితే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమ ప్రేమను వ్యక్తీకరించడానికి అమ్మాయిని ఆకట్టుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు.

యుక్త వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్లు చేసే చిలిపి పనులకు హద్దూ పద్దూ ఉండదు. నచ్చిన అమ్మాయి కనబడితే ఆమెను ఇంప్రెస్ (Impressing girls) చేసేందుకు వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమ ప్రేమ (Love)ను వ్యక్తీకరించడానికి అమ్మాయిని ఆకట్టుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. కొందరు పాటలు పాడుతారు, మరికొందరు ఖరీదైన బహుమతులు ఇస్తారు. కొద్ది మంది మాత్రం తమ తెలివి తేటలకు పదును పెట్టి అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం అలాంటి ఓ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.

తాజాగా ఓ అమ్మాయి తనకు ఓ అబ్బాయి ఇచ్చిన స్లిప్‌ను ట్విటర్‌ (X)లో పోస్ట్ చేసింది. రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఆమెకు ఓ కుర్రాడు కింద పడిపోయిందని చెప్పి ఆ స్లిప్ (Slip) ఇచ్చాడు. ఆ స్లిప్‌లో ``మీరు పెన్సిలా (Pencil)? దూరం నుంచి అప్సర (Apsara)లా కనిపిస్తున్నారు`` అంటూ చివర్లో స్మైల్ సింబల్ వేశాడు. ఆ స్లిప్‌లో రాసి ఉన్న మేటర్ ఆ అమ్మాయిని ఆశ్చర్యపరిచింది. అప్సర పెన్సిల్‌ (Apsara Pencil)ను ఉపయోగించుకుంటూ తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన విధానం నచ్చింది. ఆ స్లిప్‌ను ఫొటో తీసి ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Shocking: సిటీల్లో అద్దెకు ఉంటున్న వాళ్ల కష్టాలకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.. చిన్న తప్పునకు ఓ యజమాని ఎంత జరిమానా విధించాడో చూస్తే..!

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఐడియా బాగుంది.. దీనిని నేను ప్రయత్నిస్తా``, ``చాలా ప్రేమతో రాశాడు.. త్వరగా ఓకే చెప్పండి``, ``ఆ స్లిప్‌నకు లామినేట్ చేసి ఉంచుకోండి.. మంచి జ్ఞాపకం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-10-17T15:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising