Protecting elephants with AI: అటవీ జంతువులను కాపాడే పనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ..!
ABN, First Publish Date - 2023-03-23T07:08:54+05:30
Protecting elephants with AI: భారతీయ రైలు నెట్‌వర్క్ దాదాపు 68 వేల కిలోమీటర్ల పొడవున ఉంది. పలు రైల్వే ట్రాక్‌లు నగరాలు, గ్రామాలతో పాటు అడవుల గుండా కూడా వెళతాయి.
Protecting elephants with AI: భారతీయ రైలు నెట్‌వర్క్ దాదాపు 68 వేల కిలోమీటర్ల పొడవున ఉంది. పలు రైల్వే ట్రాక్‌లు నగరాలు, గ్రామాలతో పాటు అడవుల గుండా కూడా వెళతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులు(wild animals) తరచూ రైళ్లు ఢీకొని చనిపోతున్నాయి. CAG నివేదిక ప్రకారం, 2017- 2021 మధ్య కాలంలో రైలు ప్రమాదాలలో(train accidents) 63,000కు మించిన జంతువులు మరణించాయి.
ఇందులో 73 ఏనుగులు(elephants) కూడా ఉన్నాయి. రైలు.. ఏనుగు ఢీకొన్నప్పుడు రైలు కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. రైల్వేశాఖ దీనికి పరిష్కారం కనుగొంది. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో రైళ్లు.. ఏనుగులను ఢీకొనడాన్ని అరికట్టవచ్చు. ఆప్టికల్ ఫైబర్(Optical fiber) ఉపయోగించి రైలు పట్టాల చుట్టూ అడవి జంతువుల కార్యకలాపాలను గుర్తించవచ్చు.
ఈ విషయంలో కంట్రోల్ ఆఫీసులు, స్టేషన్ మాస్టర్(Station Master), గేట్‌మ్యాన్ మరియు లోకో పైలట్‌లను సెన్సార్ల ద్వారా అప్రమత్తం చేయవచ్చు. ఈ ఫైబర్ ఆప్టిక్ ఆధారిత అకౌస్టిక్ సిస్టమ్, రైట్‌టైమ్ లో రైల్వే ట్రాక్‌పై ఏనుగుల ఉనికి గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ AI ఆధారిత సాఫ్ట్‌వేర్(AI based software) 60 కి.మీ దూరం వరకు రైల్వే ట్రాక్‌లను పర్యవేక్షించగలదు.
ఇంతేకాకుండా రైల్వే ట్రాక్(Railway track)ల దగ్గర అనధికారికంగా తవ్వడం వల్ల రైలు ఫ్రాక్చర్, రైల్వే ట్రాక్‌పై ఆక్రమణ, ట్రాక్‌ల దగ్గర కొండచరియలు విరిగిపడటం(Landslides) వంటి సంఘటనల గురించి హెచ్చరించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే AI ఆధారిత చొరబాటు గుర్తింపు వ్యవస్థ (IDS) ఏర్పాటు కోసం రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Railtel Corporation of India Limited)తో ఒప్పందంపై సంతకం చేసింది.
రైళ్లు-ఏనుగులను ఢీకొనడాన్ని నిరోధించే ఈ ఐడీఎస్ టెక్నాలజీని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చల్సా-హసిమారా సెక్షన్‌లోనూ, అస్సాంలోని లుండింగ్ డివిజన్ పరిధిలోని లంక-హవాయిపూర్ సెక్షన్‌లోనూ ప్రారంభించినట్లు ఎన్‌ఎఫ్‌ఆర్ సీపీఆర్వో సబ్యసాచి డే తెలిపారు. ఇది సత్ఫలితాలను(Good results) అందించిందని తెలిపారు.Protecting elephants with AI
Updated Date - 2023-03-23T09:42:22+05:30 IST