ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MNJ క్యాన్సర్ రోగులకు నీనారావు సత్రం ఆశ్రయం... ఆశ్రితకల్ప ఆదరణ...

ABN, First Publish Date - 2023-05-19T15:22:02+05:30

ఈ సత్రంలో బస, భోజన వసతి కోసం వచ్చే రోగులు, వారి సహాయకులకు ముందుగా MNJ హాస్పటల్ వారే రోగి వివరాలతో గుర్తింపు కార్డ్ ఇస్తారు.

Sathya Sai Baba
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాన్సర్ వ్యాధి అంటేనే ప్రాణాల మీదకు వచ్చిందని ఆ వ్యాధికి గురైనవారు బాధతో కుంగిపోతారు. అందులోనూ క్యాన్సర్ బారిన పడిన మధ్యతరగతి వారు, నిరు పేదలు క్యాన్సర్ చికిత్స, దాని ఖర్చులను భరించడమంటే మాటలు కాదు. చికిత్స కోసం హైదరాబాద్ వంటి మహానగరానికి రావడం, ఆహారం, వసతి సమకూర్చుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్నపని. ఈ పరిస్థితుల్లో హైదరాబాదులోని MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్‌కి చికిత్స కోసం వచ్చే క్యాన్సర్ రోగులు, వారి సహాయకులకు అన్నపానీయాలు, వసతి విషయంలో స్థలాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వం, సత్రాన్ని కట్టించిన ఎన్నారై దాతల ఉదారతకు నిర్వహణపరంగా శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప పేరిట శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆదరణ తోడై రోగులకు విశేష సేవలు అందిస్తున్నాయి. విషయంలోకి వెళితే..

దాతల సాయం...

ఓ మంచిపని జరగాలంటే దాని వెనుక ఎన్నో చేతులు కలవాలి... అలా ప్రారంభం అయినదే MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ "సత్రం". ఈ సత్రాన్ని నిర్మించడానికి తెలంగాణ సర్కారు స్థలాన్ని కేటాయించింది. నీనారావ్ చమకూరు ఎన్నారై ఫ్యామిలీ ఆ స్థలంలో భవంతిని కట్టడానికి ముందుకు వచ్చి రూ.4 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం అమ్‌స్టర్‌డామ్‌లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసి డాక్టర్ చామకూరు గోవిందరావు వైద్యవిద్య చదువుతున్నతన కుమార్తె నీనారావు 20 ఏళ్లకే ప్రమాదవశాత్తూ మరణించడాన్ని తట్టుకోలేక ‘నీనారావు ఛారిటబుల్‌ ట్రస్టు’ను స్థాపించి, ఆమె పేరు మీద పలు సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ సర్కారు కేటాయించిన స్థలంలో ఈ సత్రం కట్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సత్రం ప్రారంభం కాగా, మే నెల నుంచీ రోగులకు అందుబాటులోకి వచ్చింది.

MNJ హాస్పటల్‌కి వచ్చే క్యాన్సర్ రోగులు, వారికి సహాయంగా వచ్చేవారి వసతికి ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. వీరంతా అక్కడే చెట్లకింద, షెడ్ల కింద ఉండేవారు. ఇంకొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద మొత్తాలకి గదులు అద్దెకు తీసుకుని ఆర్థిక భారంతో చికిత్స కోసం వస్తుండేవారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక అండగా దొరికింది. బాధలో ఉన్నవారికి సాయమందించే వారు తక్కువగా ఉంటారు.

వారు కూడా తమకు వీలున్నప్పుడు మాత్రమే చేతనైనంత చేస్తుంటారు. కానీ సాయాన్ని నిరంతరం నిర్విరామంగా అందివ్వాలంటే మాటలు కాదు. ఇలా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలా నిరంతరం రోగులకు, వారి సహాయకులకు సాయం అందివ్వడానికి శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప పేరిట సేవలందించేందుకు తెలంగాణా రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ శివం, హైదరాబాద్ విభాగం ముందుకువచ్చింది.

MNJ ఆస్పత్రికి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారికి ఈ సత్రంలో శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప ఆధ్వర్యంలో వసతి, భోజన రూపంలో సాయం అందుతోంది. తెలంగాణలో శ్రీసత్యసాయి సంస్థల ప్రధాన కేంద్రమైన హైదరాబాదులోని నల్లకుంటలో ఉన్న "శివం" నుంచి రోజూ ఉదయం, రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. సుమారు 130 వరకూ పడకల సదుపాయం ఉన్న ఈ సత్రంలో బస, భోజన వసతి కోసం వచ్చే రోగులు, వారి సహాయకులకు ముందుగా MNJ హాస్పటల్ వారే రోగి వివరాలతో గుర్తింపు కార్డ్ ఇస్తారు. దానిని చూపిస్తే శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప సేవకులు వారికి సదుపాయాలు కల్పించి ఇక్కడ కూడా మరొక కార్డు అందిస్తారు.

రోగులు, వారి సహాయకులను ప్రేమాభిమానాలు, ఆప్యాయలతో ఆదరిస్తూ రోజుకు సగటున వందమందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాదులోని ఈ MNJ ఆస్పత్రికి వచ్చే వారు... శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప నిర్వహణలోని ఈ నీనారావు చామకూరు సత్రంలో భోజనం, వసతి సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఈ సత్రంలోనే ఉండి MNJ హాస్పటల్‌లో చికిత్సను కొనసాగించవచ్చు.

Updated Date - 2023-05-19T15:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising