ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: డబ్బులు వెదజల్లిన ఏటీఎం.. షాకింగ్ వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-11-17T17:17:43+05:30

అడిగిన దానికంటే రెట్టింపు డబ్బులు ఇస్తున్న ఓ ఏటీఎం వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు బ్యాంకులోంచి డబ్బు తెచ్చుకోవాలంటే గంటలు గంటలు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ, ఏటీఎంల రాకతో ఆ కష్టాలన్నీ ఏదో మ్యాజిక్ చేసినట్టు కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏటీఎంలే! కావాల్సినప్పుడుల్లా ఏటీఎం నుంచి డబ్బు తెచ్చుకోవచ్చు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఏటీఎంలో పొరపాట్లు దాదాపుగా జరగవనే చెప్పాలి. కానీ, ఇటీవల లండన్‌లో ఓ ఏటీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం కస్టమర్లపై కనకవర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్

లండన్‌లోని ఈస్ట్ హ్యామ్ హై స్ట్రీట్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా కస్టమర్ ఎంటర్ చేసిన దానితో పోలిస్తే రెండింతలు ఎక్కువ డబ్బు ఇవ్వడం ప్రారంభించింది. విషయం తెలిసి జనాలు ఏటీఎంకు క్యూ కట్టారు. చూస్తుండగా ఏటీఎం జనాలతో కిటకిటలాడిపోయింది. అలా అప్పనంగా వచ్చిన డబ్బు తీసుకోవడం తప్పుడు పని అని తెలిసీ జనాలు లెక్కచేయకుండా ఎగబడ్డారు(ATM dispenses double the cash).

Viral: బాబోయ్.. షమీ 7 వికెట్లు తీస్తాడని సరిగ్గా ఒక రోజు ముందే చెప్పేశాడు! ఇతడు ఎవరంటే..

వీడియో వైరల్‌ కావడంతో జనాలు కూడా ఈ దృశ్యాలకు షాకైపోతున్నారు. నైతికత లేకుండా జనాలు తమది కాని సొమ్ము కోసం ఎగబడటాన్ని విమర్శిస్తున్నారు. క్యాష్ కోసం ఎగబడ్డ జనాలపై కేసు పెట్టాలంటూ జనాలు డిమాండ్ చేశారు.వీడియో నిడివి కేవలం 9 సెకెన్లే అయినా ఏకంగా 2.4 మిలియన్ వ్యూ్స్ వచ్చిపడ్డాయి. నెట్టింట్లో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

Updated Date - 2023-11-17T17:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising