ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Miracle Incident: అద్భుతం.. లక్కంటే ఈ అమ్మాయిదే.. యమలోకానికి వెళ్లొచ్చింది

ABN, First Publish Date - 2023-08-08T16:28:03+05:30

అప్పుడప్పుడు మన ఊహకందని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ‘ఏంటి, నిజంగానే ఇది జరిగింది? అసలు నమ్మశక్యంగా లేదు’ అంటూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా ఆ ఘటనలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.

అప్పుడప్పుడు మన ఊహకందని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ‘ఏంటి, నిజంగానే ఇది జరిగింది? అసలు నమ్మశక్యంగా లేదు’ అంటూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా ఆ ఘటనలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది. ఏడు అంతస్తుల బిల్డింగ్ నుంచి అనుకోకుండా జారిపడిన ఓ యువతి.. ప్రాణాలతో బతికి బయటపడింది. నిజానికి.. అంత ఎత్తు నుంచి కిందపడితే, బతకడమనేది దాదాపు అసాధ్యం. కానీ.. ఆ యువతి మాత్రం బతికింది. యమలోకానికి వెళ్లినట్టే వెళ్లి, తిరిగి వచ్చేసింది. దీంతో.. వైద్య రంగంలో ఇదో ‘అద్భుతమైన ఘటన’ అని వైద్యులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


టోమినీ రీడ్ అనే 20 ఏళ్ల యువతి మెల్‌బోర్న్‌లోని ఒక ఏడు అంతస్తుల బిల్డింగ్ నుంచి అనుకోకుండా జారి పడింది. మరికొన్ని వారాల్లోనే ఆమె తన 21వ ఏటలో అడుగుపెట్టబోతుండగా.. ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 1:30 గంటల సమయంలో.. ఈ సమాచారాన్ని రీడ్ తల్లిదండ్రులకు తెలియజేశారు. దాదాపు 21 మీటర్ల ఎత్తు నుంచి జారిపడింది కాబట్టి, మొదట్లో ఆమె చనిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె బతికే ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే మెల్‌బోర్న్‌లోని ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు మెరుగైన ట్రీట్మెంట్ అందించి కాపాడారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఆసుపత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ, రీడ్ బతికి ఉండటం అద్భుతమని అన్నారు. అయితే.. ఆమె కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని పేర్కొన్నారు. ఆమెకు ఇదొక సవాల్ అని చెప్పారు.

మరోవైపు.. రీడ్ తండ్రి బ్రాడ్ ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారం రోజుల పాటు అనేక సర్జరీలు నిర్వహించిన అనంతరం తమ కూతురు ప్రాణాలతో బతికి బయటపడిందని, అయితే ఆమె పూర్తిగా కోలుకోవడానికి తనతో తాను గట్టిగా పోరాడాల్సి ఉంటుందని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అటు.. రీడ్ చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి, ఆమె ఆంటీ క్రిస్టిన్ ‘గోఫండ్‌మీ’లో ఫండ్ రైజర్ పేజీని క్రియేట్ చేశారు. రీడ్ విషాదగాధ విన్న ప్రజలు.. ఆమె చికిత్సకు తమవంతు సహాయం కోసం భారీ విరాళాలే అందజేస్తున్నారు. ఇప్పటివరకూ $50,000 ఫండ్స్ వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2023-08-08T16:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising