Auto Driver: ఆటో డ్రైవర్‌ను చూసి అవాక్కవుతున్న ప్రయాణీకులు.. ఆటో ఎక్కిన అందరిదీ అదే పరిస్థితి.. అసలు కథేంటంటే..!
ABN, First Publish Date - 2023-09-25T10:35:59+05:30
బెంగుళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఆటో ఎక్కిన అందరూ అతను చేసిన పని చూసి షాక్ అవుతున్నారు
పట్టణాలు నగరాలలో సిటీ బస్సులు సమయానికి దొరక్క చాలామంది ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు వంటి మహా నగరాలలో ఆటోవాలాలు చాలాసార్లు వైరల్ అవుతుంటారు. ఇప్పుడు బెంగుళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఆటో ఎక్కిన అందరూ అతను చేసిన పని చూసి షాక్ అవుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాలోలకి వెళితే..
ఆటోలు నడిపే వారిలో బాగా చదువుకున్నవారు, తెలివైన వారు చాలామంది ఉంటారు. వీరు తమ అభిరుచి, సౌకర్యం కోసం తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతం చేస్తారు. బెంగుళూరుకు చెందిన ఒక ఆటోడ్రైవర్ ఇదే పని చేశాడు. అతను డ్రైవింగ్ చేసేటప్పుడు వీపు నొప్పి లేకుండా తల, వీపు భాగం మొత్తం ఆనుకుని ఉండటానికి గేమింగ్ చైర్ ను తన డ్రైవింగ్ సీటులో సెట్ చేశాడు. వైరల్ అవుతున్న ఫోటోలో గేమింగ్ చైర్ ను డ్రైవర్ సీటులో అమర్చి ఉండటం గమనించవచ్చు. దీనివల్ల అతను డ్రైవ్ చేసేటప్పుడు చైర్ కు ఆనుకుని కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చెయ్యగలుగుతున్నాడు.
Hair oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే భృంగరాజ్ నూనెను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితాలు చూసి మీరే షాకవుతారు!!
ఆటోలో ఉన్న ఈ మార్పుకు సంబంధించిన ఫోటోను Anuj Bansal అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'టెక్ బ్రదర్స్ ఎందుకు ఇంత వినోదం కలిగి ఉంటారు?' అంటారు అనే క్యాప్షన్ ఈ ఫోటోకు మెన్షన్ చేశారు. ఈ ఫోటో చూసిన పలువురు ఆశ్చర్యపోతుండగా మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తిం చేస్తున్నారు. 'మొదట ఆ ఆటో డ్రైవింగ్ గేమ్ లాగా స్ఠార్ అవుతుందేమో అందుకే గేమింగ్ చైర్ పెట్టుకున్నారు' అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. 'బెంగుళూరులో ఇలాంటి విషయాలు కొత్తగా కనుక్కోవాల్సిన పనిలేదు, దీని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'బెంగుళూరు నగరంలోని టెక్ సంస్థలలోనే కాదు బెంగుళూరు ప్రజల నుండి కూడా టెక్నాలజీ పుడుతుంది' అని మరొకరు బెంగుళూరు మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
Health Fact: కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలిస్తే..
Updated Date - 2023-09-25T10:35:59+05:30 IST