ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాగేశ్వర్ ధామ్‌కు క్యూ కడుతున్న భక్త జనం... కారణమిదే!

ABN, First Publish Date - 2023-01-21T10:56:55+05:30

మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్ జిల్లా గఢా గ్రామంలో ఉంటున్న బాగేశ్వర్ ధామ్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్ జిల్లా గఢా గ్రామంలో ఉంటున్న బాగేశ్వర్ ధామ్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బాగేశ్వర్ ధామ్ మహారాజ్‌కి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు, భక్తులు ఉన్నారు. బాగేశ్వర్ ధామ్ మహారాజ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బాగేశ్వర్ ధామ్ మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఉంది. ఇది బాలాజీ ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయ పునరుద్ధరణ 1986లో జరిగింది. శ్రీ బాలాజీ మహారాజ్ ఆలయం వెనుక ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాత సేతులాల్ గార్గ్ సన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతారు. ధీరేంద్ర గార్గ్ ఈ ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు. భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాలుపంచుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ భాగేశ్వర్ ఆలయాన్ని బాగేశ్వర్ ధామ్ అని పిలవడం ప్రారంభమైంది. ప్రస్తుతం పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు.

భాగేశ్వర్ ధామ్ మహారాజ్ ఆస్థానానికి రోజూ వందలాది మంది వస్తారు. ఒక భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం పండిట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చినా ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట. వారి సమస్యలు, అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట. ఇది ఎవరికీ సాధ్యం కాదని ఆ భక్తుడు తెలిపాడు. ఈ నేపధ్యంలోనే విదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వస్తుంటారట. మహారాజ్‌ని కలుసుకోవాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తుందని భక్తులు చెబుతారు.

Updated Date - 2023-01-21T10:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising