ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bald Head: బట్టతల వచ్చేస్తోందా..? రోజూ జుట్టు తెగ రాలిపోతోందా..? ఈ నూనెను కనుక రాసుకుంటే ఒక్క నెలలోనే..!

ABN, First Publish Date - 2023-09-26T11:05:13+05:30

అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బట్టతల బారిన పడుతుంటారు. నెలరోజులపాటు ఈ నూనె రాసుకోవడం వల్ల బట్టతల మాయమై కొత్త జుట్టు పెరుగుతుంది.

జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలకు పొడవాటి జడ, అబ్బాయిలకు ఒత్తైన జుట్టును అందంగా క్రాఫ్ చేయించుకోవడం ఎంతో ఇష్టం. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలంలో ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్, వాతావరణ మార్పులు అన్ని కలిసి జుట్టు రాలే సమస్యను అధికం చేస్తున్నాయి. జుట్టు రాలడం అనే సమస్య ఒక పరిధి దాటిపోతే అది బట్టతలకు కారణం అవుతుంది. విచిత్రం ఏమిటంటే అబ్బాయిలలోనే కాదు అమ్మాయిలలో కూడా బట్టతల వస్తుంది. దీన్ని నివారించడానికి, జుట్టు పెరిగేలా చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారు జుట్టు పెరుగుదలకు నూనెలు ఉపయోగించవచ్చు. ఈ నూనెలు నెలరోజుల పాటు వాడితే జుట్టు పెరగడం ఖాయం. ఇవి జుట్టు కుదుళ్లలోకి ఇంకి జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

ఉల్లిపాయ నూనె..(onion oil)

ఈ మధ్యకాలంలో జుట్టు పెరుగుదలకు, జుట్టు నల్లగా మారడానికి ఉల్లిపాయను విరివిగా ఉపయోగిస్తున్నారు. చాలామంది ఉల్లిపాయ రసాన్ని వాడుతారు. కానీ ఉల్లిపాయ నూనెను తయారుచేసుకుని వాడితే బట్టతల రాకుండా చెయ్యవచ్చు. ఉల్లిపాయలో ఉండే అధిక సల్ఫర్ జుట్టు సమస్యలకు అన్నింటికి చెక్ పెడుతుంది. జుట్టు PH స్థాయిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయ నూనెను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలంటే..

కప్పు ఉల్లిపాయల ముక్కలు, కప్పు కరివేపాకు తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను రెండు కప్పుల కొబ్బరినూనెలో వేసి బాగా మందంగా ఉన్న కడాయిలో ఉడికించాలి. మొదట 5నుండి 10నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఆ తరువాత 10నిమిషాలు మంట పెంచి మరిగించాలి. ఆ తరువాత మళ్లీ మంట తగ్గించి 15నిమిషాలు సన్నమంట మీద ఉడికించాలి. ఈ ప్రాసెస్ లో ఉల్లిపాయ, కరివేపాకు సారం అంతా నూనెలోకి వెళుతుంది. నూనె పూర్తీగా ఉడికిన తరువాత దాన్ని రాత్రంతా అలాగే ఉంచేయాలి. మరుసటిరోజు స్ట్రైనర్ సహాయంతో వడగట్టి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని తలమీద బాగా మసాజ్ చేస్తుంటే ఒక్క నెలలోపే జుట్టు ఊహించని విధంగా పెరుగుతుంది.

Shocking: 10 రోజులుగా బాత్రూంకు వెళ్లలేదో వ్యక్తి.. తీవ్రమైన ఛాతినొప్పితో ఆస్పత్రికి.. డాక్టర్లే నివ్వెరపోయిన పరిస్థితి.. చివరకు..!



బాదం నూనె..(Almond oil)

జుట్టు పెరగడానికి ఉపయోగపడే నూనెల్లో బాదం నూనె కూడా ఒకటి. ఈ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టు మృదువుగా మారుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం ద్వారా జుట్టు కుదుళ్లు తిరిగి జీవం పుంజుకుంటాయి. జుట్టు తొందరగా తెల్లబడటాన్ని నివారించి నల్లగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. బట్టతల వస్తుందేమోననే భయం ఉన్నవారు బాదం నూనెను వాడొచ్చు.

కొబ్బరినూనె..(coconut oil)

కొబ్బరినూనె చాలామంది ప్రతిరోజూ వాడేదే కదా అనుకుంటారు. నిజానికి మంచి ఆహారం తీసుకుంటూ కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించవచ్చు. కొబ్బరినూనె జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది. కాలుష్యం, పొగ, వేడి నుండి జుట్టును కాపాడటంలో కొబ్బరినూనె చక్కగా పనిచేస్తుంది. తలస్నానానికి గంట ముందు లేదా ముందురోజు గోరువెచ్చని కొబ్బరినూనెతో హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమవుతుంది.

High Cholesterol Signs: సైలెంట్ కిల్లర్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చెవుల వద్ద సంకేతాలు..!


Updated Date - 2023-09-26T11:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising